సింగం ట్రైల‌ర్: అరుపులు మెరుపులే

రోహిత్ శెట్టి సింగం ఎగైన్ ప్ర‌క‌టించిన నాటి నుంచి ఆ సినిమాపై ఎలాంటి బ‌జ్ క్రియేట్ అవుతుందో చెప్పాల్సిన ప‌నిలేదు.

Update: 2024-10-07 11:07 GMT

బాలీవుడ్ లో సింగం ప్రాంచైజీ అంటే మార్కెట్ లో ఓ బ్రాండ్ గా ముద్ర‌ప‌డిపోయింది. సింగం నుంచి రిలీజ్ అంటే? ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి అంత‌కంత‌కు పెరిగిపోతుంది. రోహిత్ శెట్టి సింగం ఎగైన్ ప్ర‌క‌టించిన నాటి నుంచి ఆ సినిమాపై ఎలాంటి బ‌జ్ క్రియేట్ అవుతుందో చెప్పాల్సిన ప‌నిలేదు. దానికి తోడు ఈసారి ఏకంగా టాప్ స్టార్ల‌నే రంగంలోకి దించారు. అజ‌య్ దేవ‌గ‌ణ్‌, అక్ష‌య్ కుమార్, టైగ‌ర్ ష్రాప్, అర్జున్ క‌పూర్, ర‌ణ‌వీర్ సింగ్ , దీపికా ప‌దుకొణే, క‌రీనా క‌పూర్ ఇలా టాప్ స్టార్లు అంతా సింగం ఎగైన్ లో భాగ‌మ‌వ్వ‌డంతో అంచ‌నాలు అంత‌కంత‌కు రెట్టింపు అయ్యాయి.

ఆయా పాత్ర‌ల ఫ‌స్ట్ లుక్ రివీల్ చేస్తేనే బో లెడంత హైప్తో బ‌య‌ట‌కు వ‌చ్చాయి. దీంతో టీజ‌ర్, ట్రైల‌ర్ ఎలా ఉంటుంద‌నే అంచ‌నాలు అంత‌కంత‌కు పెరిగిపోతున్నాయి. తాజాగా కొద్ది సేప‌టి క్రిత‌మే ట్రైల‌ర్ రిలీజ్ అయింది. ప్రేక్ష‌కులు ఎప్ప‌టి నుంచో ఎదురుచూస్తోన్న ఉత్సాహానికి నెటితో ప‌వ‌ర్ ప్యాక్డ్ ట్రైల‌ర్ తో తెర దించారు. మ‌చ్చుకు వ‌దిలిన ట్రైల‌ర్ అరాచ‌క‌మే. అజ‌య్ దేవ‌గ‌ణ్ బాజీరావ్ సింగమ్ గా త‌న ఐకానిక్ రోల్ లో అద‌ర‌గొట్టాడు.

ఇక లేడీ సింగం దీపికా ప‌దుకొణే న‌ట‌న అయితే అరాచ‌క‌మే. పోలీస్ పాత్ర‌లో దుమ్ముదులిపేసింది. ప‌ర్పెక్ట్ లేడీ సింగమ‌నిపించింది. పంచ్ డైలాగులు...యాక్ష‌న్ పంచ్ తో దీపిక లో కొత్త యాంగిల్ ని బ‌య‌ట‌కు తీసింది. ఆమెకి ఈపాత్ర స్పెష‌ల్ గా గుర్తింపు తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. ఇక విల‌న్ గా అర్జున్ క‌పూర్ రోల్ రాఅండ్ ర‌స్టిక్ గా హైలైట్ అవుతుంది.

క‌రీనా క‌పూర్, ర‌ణ‌వీర్ సింగ్ క్యామియో పాత్ర‌లు సినిమాకి అద‌న‌పు బ‌లంగా కొలిసొస్తాయి. దాదాపు అన్ని పాత్ర‌ల్ని ట్రైల‌ర్ లో ప‌రిచ‌యం చేసారు. బీజీఎమ్ బాగుంది. రామాయ‌ణం కాన్సెప్ట్ ఆధ‌రాంగా ఈ చిత్ర క‌థ‌ని, అందులో పాత్ర‌ల్న తీసుకున్న‌ట్లు క‌నిపిస్తుంది. హిందుత్వం అంశాన్ని ట‌చ్ చేయ‌డం మార్కెట్ ప‌రంగా క‌లిసొచ్చే అంశం. ట్రైల‌ర్ స్లోగా ప్రారంభం అయినా ముగింపు మాత్రం అదిరిపోయింది. ఐదు నిమిషాల నిడివి ట్రైల‌ర్ మాస్ యాక్ష‌న్ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది.

Tags:    

Similar News