త్రివిక్రమ్ - రవితేజ వారసులు.. ఇద్దరు అక్కడే..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో స్పిరిట్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో స్పిరిట్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఆ సినిమాలో ప్రభాస్ నెవ్వర్ బిఫోర్ రోల్ లో కనిపించనున్నారు. దీంతో మూవీ కోసం ఓ రేంజ్ లో వెయిట్ చేస్తున్నారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.
అయితే స్పిరిట్ మూవీకి గాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కొడుకు రిషి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నట్లు కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. రిషి ఇప్పటికే విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. దీంతో ఇప్పుడు సందీప్ వంగా దగ్గర రాటుదేలనున్నాడని అంతా చెబుతున్నారు.
ఇప్పుడు రిషితో పాటు మాస్ మహారాజా కొడుకు రవితేజ మహాధన్ కూడా సందీప్ వంగా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేయనున్నాడని తెలుస్తోంది. అయితే మహాధన్.. హీరోగా ఎంట్రీ ఇస్తాడో లేదో క్లారిటీ లేదు. కానీ తండ్రి లాగే అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేయనున్నారని ఇప్పుడు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
మొత్తానికి అటు త్రివిక్రమ్ కొడుకు.. ఇటు రవితేజ కొడుకు.. ఇద్దరూ సందీప్ రెడ్డి వంగా దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారన్న మాట. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. రిషి, మహాధన్ కు నెటిజన్లు బెస్ట్ విషెస్ చెబుతున్నారు. డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
అయితే త్రివిక్రమ్ కొడుకు.. ఇప్పటి వరకు మీడియాకు ఎక్కువగా కనిపించలేదు. అదే సమయంలో మహాధన్.. ఇప్పటికే తన తండ్రి రాజా ది గ్రేట్ మూవీతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అప్పుడప్పుడు మహాధన్ పిక్స్ బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.
ఇక రవితేజ కూడా కెరీర్ స్టార్టింగ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. అనేక సినిమాల ద్వారా టాలెంట్ నిరూపించుకున్నారు. ఇప్పుడు మహాధన్.. కూడా తండ్రిలానే అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే మన దగ్గరే కాదు.. నార్త్ లో కూడా చాలా మంది సెలబ్రిటీల పిల్లలు అసిస్టెంట్ డైరెక్టర్లుగానే పని చేయడం గమనార్హం.