హనుమాన్ విధ్వంసం.. అక్కడ అల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్

ఇక ఓవర్సీస్ లో హనుమాన్ దెబ్బకు మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోల రికార్డ్స్ అన్ని బద్దలైపోయాయి.

Update: 2024-01-20 11:16 GMT

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా నటించిన ఇండియన్ సూపర్ హీరో మూవీ 'హనుమాన్' ప్రస్తుతం ఇండియన్‌ బాక్సాఫీస్ ని షేక్‌ చేస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా వరల్డ్‌ వైడ్‌గా రూ.150 కోట్లు వసూళ్లు చేసింది. ఇప్పటికే బ్రేక్‌ ఈవెన్‌ సాధించిన ఈ సినిమా ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం అద్భుతంగా ఉందని, విజువల్స్‌ అయితే నెక్ట్స్‌ లెవల్‌ లో ఉన్నాయని అంటున్నారు ప్రేక్షకులు ఇక నార్త్ లో అయితే హనుమాన్‌ మ్యానియా మాములుగా లేదు. హిందీ ఆడియన్స్ సినిమాకి చూపిస్తున్న ఆదరణకు రోజురోజుకు అక్కడ థియేటర్లు పెంచుకుంటూ పోతున్నారు. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం హనుమాన్‌కు అక్కడ మరింత ప్లస్‌ అయ్యింది.

మరో వారం రోజుల పాటూ హనుమాన్ హంగామా ఇదే రేంజ్ లో కొనసాగే అవకాశం ఉందని ట్రేడ్‌ పండితులు అంటున్నారు. అటు ఓవర్సీస్ లో అయితే చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోలకు సమానంగా కలెక్షన్స్ అందుకుంటూ కళ్ళు కదిలే రికార్డులు సృష్టిస్తుంది హనుమాన్. సినిమా రిలీజైన 4 రోజుల్లోనే ఓవర్సీస్ లో 3 మిలియన్ కి పైగా కలెక్షన్స్ తో టాప్-10 సినిమాల జాబితాలో చోటు సంపాదించుకున్న హనుమాన్ ఇప్పుడు యూ.ఎస్ ఆల్ టైం టాలీవుడ్ హిట్స్ లో ఐదవ స్థానానికి ఎగబాకింది.

ఇక ఓవర్సీస్ లో హనుమాన్ దెబ్బకు మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోల రికార్డ్స్ అన్ని బద్దలైపోయాయి. హనుమాన్ సెకండ్ వీకెండ్ లో భాగంగా శుక్రవారం ఓవర్సీస్ లో 3.7 మిలియన్ డాలర్ల వసూలు సాధించింది. ఈ కలెక్షన్స్ తో హనుమాన్ అక్కడ టాప్ 5 లిస్టులో చేరింది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ అలవైకుంఠపురంలో 3.6, రంగస్థలం 3.5 మిలియన్ డాలర్ల వసూళ్లతో అక్కడ టాప్ లో ఉండగా హనుమాన్ ఈ రెండింటిని దాటేసి 3.7 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ అందుకుంది. యూఎస్ బాక్సాఫీస్ వద్ద బాహుబలి-1 తర్వాతి స్థానం హనుమాన్ దే కావడం విశేషం.

అమెరికాలో ఆల్ టైం టాప్ 5 తెలుగు సినిమాల లిస్ట్ ఇదే..

1. బాహుబలి- 2 - $ 20.5 మిలియన్

2. RRR. $ 14.3 మిలియన్

3. సలార్ $ 8.8 మిలియన్

4. బాహుబలి-1 - $ 8 మిలియన్

5. హనుమాన్ - $ 3.7 మిలియన్

Tags:    

Similar News