పెద్ద ప్ర‌క‌ట‌న అంటూ షాకిచ్చిన హార్థిక్ పాండ్య‌

ఆ త‌ర్వాత చాలా ప‌రిణామాలు అభిమానుల‌కు స్ప‌ష్టంగా తెలుసు.

Update: 2024-10-25 12:44 GMT

టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఫ్యామిలీ క‌ల‌త‌ల గురించి తెలిసిన‌దే. భార్య న‌టాషా నుంచి విడాకులు తీసుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు పాండ్యా. ఆ త‌ర్వాత చాలా ప‌రిణామాలు అభిమానుల‌కు స్ప‌ష్టంగా తెలుసు. అయితే హార్థిక్ ఇటీవ‌ల‌ ప్ర‌ముఖ భాలీవుడ్ క‌థానాయిక‌తో ప్రేమాయ‌ణం ప్రారంభించాడ‌ని, లేదూ.. బ్రిట‌న్ కి చెందిన ప్ర‌ముఖ మోడ‌ల్ కి ట‌చ్ లో ఉన్నాడ‌ని ర‌క‌ర‌కాల ఊహాగానాలు ప్ర‌చారం అయ్యాయి.

అదంతా అటుంచితే ఇప్పుడు హార్థిక్ చేసిన ఓ ప్ర‌క‌ట‌న అభిమానుల్లో క‌ల్లోలంగా మారింది. పాండ్యా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో తాను పెద్ద ప్రకట‌న చేయ‌బోతున్నానని, త్వరలో వివరాలను వెల్లడిస్తానని తెలిపాడు. దీంతో అతడు మ‌రో పెళ్లి చేసుకోబోతున్నాడా? అంటూ సందేహం వ్య‌క్తం చేస్తున్నారు నెటిజనులు. ఒక‌వేళ పెళ్లి చేసుకుంటే ఎవ‌రిని పెళ్లాడుతున్నాడు? అంటూ ఆరాలు తీస్తున్నారు. ఒకే ఒక్క ప్ర‌క‌ట‌న‌తో అత‌డు ప్ర‌కంప‌నాలు పుట్టించాడు.

ఈ స‌మ‌యంలో ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 కోసం పది జట్లు తమ రిటెన్షన్‌లను ప్రకటించడానికి చివరి తేదీ అక్టోబర్ 31. అందుకే పాండ్యా పోస్ట్ అభిమానుల్లో క‌ల్లోలంగా మారింది. అత‌డు టీమ్ మార‌తాడ‌నే ఊహాగానాలు ఈ ప్ర‌క‌ట‌న త‌ర్వాత‌ పీక్స్ కి చేరుకుంటున్నాయి.

మునుపటి సీజన్ కంటే ముందు 15 కోట్లు + ఆల్-క్యాష్ డీల్ ద్వారా హార్దిక్‌ను ముంబై ఇండియన్స్ (MI) జట్టులోకి తీసుకున్నారు. ఇది మాత్రమే కాదు... అతడు నాయకత్వ సెటప్‌లో ఫ్రాంచైజీలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ రోహిత్ శర్మ స్థానంలో ఉన్నాడు. కానీ మొత్తం ఐపిఎల్ 2024 సమయంలో అభిమానుల నుండి చాలా విమర్శలను ఎదుర్కొన్నాడు. ఈ సీజన్‌లో హార్దిక్ ముంబై ఇండియన్స్‌ను నడిపించాడు. కానీ ఏదీ ప‌ని చేయ‌లేదు. ఆట‌లో అతడి జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.

మ‌రోవైపు హార్థిక్ పాండ్యా ప్ర‌ఖ్యాత `ది సోల్డ్ స్టోర్` కంపెనీలో ప్ర‌ధాన వాటాదారుగా చేరాడు. ఇక‌పై ఈ కంపెనీకి ప్ర‌క‌ట‌న‌లు కూడా చేయ‌బోతున్నాడు. లైఫ్ స్టైల్ స్టోర్ కి సంబంధించిన మొత్తం 30 స్టోర్లు ఇండియాలో ఉన్నాయి.

Tags:    

Similar News