టైట్ సిచ్వేషన్ లో వెంకీ-బాలయ్య ఛాన్స్ ఇస్తారా?
నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నుంచి కూడా ఈ విషయంలో క్లారిటీ వచ్చింది.;

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డబ్బులు అవసరం ఉన్నంత కాలం సినిమాలు చేస్తానని ఇటీవలే క్లారిటీ ఇచ్చారు. దీంతో ఆయన మరికొన్నాళ్ల పాటు సినిమాలు చేస్తారని క్లారిటీ వచ్చేసింది. ఈ నేపథ్యంలో హరీష్ శంకర్ తెరకెక్కించాల్సిన 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యమైనా ఉంటుందని తెలుస్తోంది. నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నుంచి కూడా ఈ విషయంలో క్లారిటీ వచ్చింది. కానీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది? అన్నది ఎవ్వరూ చెప్పలేని పరిస్థితే.
అయితే పవన్ డేట్లు ఇచ్చేలోపు మరో సినిమా చేయాలని ఆలోచన చేస్తున్నాడు. దీనిలో భాగంగా నటసింహ బాలకృష్ణకు కూడా స్టోరీ చెప్పినట్లు వార్తలొస్తున్నాయి. కానీ బాలయ్య నుంచి ఇంకా గ్రీన్ సిగ్నెల్ రాలేదు. ఎందుకంటే బాలయ్య ఫుల్ ఫాంలో ఉన్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. `అఖండ2` పాన్ ఇండియాలో రిలీజ్ అవుతుంది. సినిమాపై పాన్ ఇండియాలోనే భారీ అంచనాలున్నాయి. ఇలాంటి టైమ్ లో? హరీష్ తో సినిమా కరెక్టేనా? అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు హరీష్...విక్టరీ వెంకటేష్ కి కూడా స్టోరీ చెప్పినట్లు..ఆ కాంబినేషన్ లో కూడా సినిమా ఉంటుందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇది కూడా అంత ఈజీ కాదిప్పుడు. వెంకటేష్ ఇప్పుడు 300 కోట్ల క్లబ్ లో చేరిన హీరో. తదుపరి ఏ సినిమా చేసినా? అది అంతకు మించే ఉండాలి తప్ప తగ్గడానికి వీల్లేదు. వెంకటేష్ స్టోరీలు ఫైనల్ చేయాల్సింది సురేష్ బాబు. ఆయన ఇమేజ్ ని ఎన్ క్యాష్ చేసేది ఆయనే.
సురేష్ బాబు నుంచి గ్రీన్ సిగ్నెల్ వస్తేనే పట్టాలెక్కేదే. లేదంటే వెంకటేష్ ఒకే చేసినా సురేష్ బాబు వద్ద రిజెక్ట్ అయితే? ఛాన్సే ఉండదు. హరీష్ శంకర్ కి సరైన సక్సెస్ పడి కూడా చాలా కాలమవుతోంది. `గబ్బర్ సింగ్` తర్వాత సరైన హిట్ పడలేదు. ఆ తర్వాత చేసిన సినిమాలేవి కమర్శియల్గా వర్కౌట్ అవ్వలేదు. `ఉస్తాద్ భగత్ సింగ్` ప్రకటించిన తర్వాత పవన్ డేట్లు సర్దుబాటు కాని నేపథ్యంలో చేసిన చిత్రమే `మిస్టర్ బచ్చన్`.
ఈ సినిమా ఎఫెక్ట్ కూడా హరీష్ పై పడుతుంది. మిస్టర్ బచ్చన్ కూడా కూడా బాక్సాఫీస్ వద్ద తేలిపో యింది. మరి ఇలాంటి ప్రతికూల పరిస్థితుల నడుమ బాలయ్య...వెంకీ ఎస్ చెబుతారా? అన్నది సందేహమే. ఒకవేళ వాళ్లిద్దరులో ఎవరు ఒకే చేసినా హరీష్ కి లిప్ట్ ఇచ్చిన వాళ్లే అవుతారు.