సెల్ఫీ క్లిక్ తో పిచ్చెక్కిస్తున్న నేహా సిస్టర్‌

రామ్ చరణ్ హీరోగా నటించిన చిరుత సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ నేహా శర్మ.

Update: 2023-12-18 07:28 GMT

రామ్ చరణ్ హీరోగా నటించిన చిరుత సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ నేహా శర్మ. సినిమాల్లో పెద్దగా రాణించకున్నా కూడా సోషల్‌ మీడియాలో ఆమె అందాల ఆరబోత ఫోటోలు మరియు వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. నేహా శర్మ కు ఏమాత్రం తగ్గకుండా ఆమె సోదరి ఐషా శర్మ కూడా సోషల్ మీడియాలో అందమైన ఫోటోలను షేర్ చేస్తూ పాపులారిటీని దక్కించుకుంది.


ఇప్పటి వరకు ఐషా చేసింది ఒకే సినిమా అయినా కూడా సోషల్ మీడియా ద్వారా చాలా సినిమాలు చేసిన ముద్దుగుమ్మల రేంజ్ లో క్రేజ్ ని దక్కించుకుంది. సినిమాలతోనే కాకుండా ఇలా అందమైన ఫోటోలతో కూడా పాపులారిటీని సొంతం చేసుకోవచ్చు అని ఐషా నిరూపించింది.


తాజాగా మరోసారి తన అందంతో కట్టి పడేసినంత పని చేసింది. సెల్ఫీ క్లిక్‌ తో తన అందాన్ని బంధించిన ఐషా ఆ ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం ద్వారా కుర్రకారు కి మతిపోయినంత పనైంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.


ఐషా ఇంత అందంగా ఉండి, సోషల్ మీడియా ద్వారా ఇంతగా పాపులారిటీ సొంతం చేసుకున్న కూడా పాపం సినిమా ల్లో ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదు అంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందు ముందు అయినా హిందీతో పాటు మన సౌత్‌ లో కూడా ఐషాకి ఆఫర్లు రావాలని ఆమె ఫాలోవర్స్ మరియు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Tags:    

Similar News