కంగువా.. లుక్స్ తోనే కిక్కిచ్చే హైప్

ఏందిరా ఇట్లుంది అదిరిపోయింది గ్లింప్స్​, ఆ లుక్స్​ చూస్తే భయంకరంగా ఉంది కానీ అదిరిపోయాడురా, విజువల్స్​ ఏమున్నాయ్​రా బాబు, బ్యాక్​ గ్రౌండ్​ మ్యూజిక్​ అయితే గూస్​ బంప్సే.. ఇదంతా దేని గురించి అనుకుంటున్నారా.. అప్పటి వరకు లవర్​ బాయ్​గా, విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించే.

Update: 2023-07-24 04:55 GMT

ఏందిరా ఇట్లుంది అదిరిపోయింది గ్లింప్స్​, ఆ లుక్స్​ చూస్తే భయంకరంగా ఉంది కానీ అదిరిపోయాడురా, విజువల్స్​ ఏమున్నాయ్​రా బాబు, బ్యాక్​ గ్రౌండ్​ మ్యూజిక్​ అయితే గూస్​ బంప్సే.. ఇదంతా దేని గురించి అనుకుంటున్నారా.. అప్పటి వరకు లవర్​ బాయ్​గా, విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించే. తాజాగా ఆయన పుట్టినరోజు సందర్భంగా భారీ పీరియాడిక్ డ్రామాగా వస్తున్న 'కంగువ' గ్లింప్స్​ రిలీజై అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. దీన్ని చూసిన అభిమానులు, సినీ ప్రియులు ఇలానే మాట్లాడుకుంటున్నారు.

వాస్తవానికి ఆ మధ్యే కమల్​హాసన్​ 'విక్రమ్'​తోనే ఈ తరహా బ్లడ్​ పాత్​ లుక్స్​ను బయటకు తీసి తన యాక్టింగ్​తో భయపెట్టేశారు సూర్య. అంతలోనే ఇప్పుడు 'కంగువ'తో వచ్చి అంతకుమించి అనేలా వణుకుపుట్టించారు. ఒళ్లంతా పులిగోర్లు, పచ్చబొట్లు లుక్స్​తో అలాగే కుశలమా అంటూ కళ్లతోనే భయపెట్టేశారు. అయితే ఇప్పుడు గ్లింప్స్​తో పాటు ఫస్ట్ లుక్​ పోస్టర్​ను కూడా విడుదల చేసింది మూవీటీమ్.


ఇందులో ఆయన ఓ ఓటమెరుగని యోధుడిగా కనిపించి ఆకట్టుకుంటున్నారు. నిప్పుల గుండంపై.. గుర్రంపై సవారి చేస్తూ, చేతిలో కత్తి పట్టుకుని మైండ్​ బ్లో అయ్యేలా సీరియస్​ లుక్​లో కనిపించారు. ఆయన చుట్టూ తన చాలా మంది ఆటవిక జాతి మనషులు కనిపిస్తున్నారు. అలానే చుట్టూ నిప్పు కాగడాలు కనిపిస్తున్నాయి. నిజానికి కంగువ అంటే అగ్నిని ధరించిన వ్యక్తి అని అర్థం. ఎప్పుడు అగ్నిని తనతో పాటే ఉంటుకుంటాడు. అలానే కంగువ అంటే పరాక్రమవంతుడని కూడా అంటారు. అలా పేరుకు తగ్గటుగానే ఈ ఫస్ట్​ లుక్​ పోస్టర్​ను.. అగ్నిని తన పాటు ఉంచుకున్న వ్యక్తిగా, యోధుడిగా కంగువను డిజైన్​ చేసి అద్భుతంగా చూపించారు. ఈ పోస్టర్​ కూడా అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. దీని చూసి వారంతా సంబరపడిపోతున్నారు. ఈ చిత్రం ప్రభాస్ బాహుబలికి మించి హిట్ అవుతుందని ఆశిస్తున్నారు.

ఇకపోతే ఇప్పటికే గ్లింప్స్​లో రెండు ఆటవిక జాతుల మధ్య జరిగే ఆధిపత్య పోరే ఈ సినిమా కథ అన్నట్టుగా చూపించారు. కంగువను మారాక్రుని వంశకుడిగా తెలిపారు. చరిత్ర ప్రకారం.. అతడు అతి పెద్ద మందయార్ పోర్వతాలను అధిరోహించిన సాహసమైన వ్యక్తి. అలాగే పొడవైన చెట్లు ఎక్కగలడు, తెల్ల పులితో సైతం పోరాడిన పరాక్రమవంతుడు.

మదమెక్కిన ఏనుగును సైతం వంచి అప్పట్లో దానిపై తిరిగేవాడట. ఎప్పుడూ వంద పులిగోరులు మెడలో వేసుకుని ఉంటాడట. అంతటి వీరుడు ధీరుడు పరాక్రమవంతుడైన కంగువ... తన జాతిని కాపాడుకోవడానికి, అలాగే ఆధిపత్యాన్ని సంపాదించడానికి ఎలాంటి పోరాటాలు చేశాడనేదే ఈ సినిమా కథ అని అంటున్నారు.

Tags:    

Similar News