కాంతార ప్రీక్వెల్.. బడ్జెట్ మళ్ళీ పెరిగిందా?

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార’ మూవీ కన్నడనాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.

Update: 2024-09-17 03:42 GMT

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార’ మూవీ కన్నడనాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. హోంబలే ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని 16 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తే ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్ వరల్డ్ వైడ్ గా వచ్చాయి. ఒక్క కన్నడ భాషలోనే ఈ సినిమాకి 100 కోట్లకి పైగా కలెక్షన్స్ రావడం విశేషం. ‘కేజీఎఫ్’ సిరీస్ తర్వాత కన్నడంలో 100 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసిన సినిమా ఇదే. మూవీ తర్వాత ఇతర భాషలలో డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు.

అన్ని భాషలలో ‘కాంతార’కి అద్భుతమైన ఆదరణ లభించింది. తెలుగులో 60 కోట్ల వరకు కలెక్షన్స్ ఈ సినిమాకి వచ్చాయి. ఇప్పుడు రిషబ్ శెట్టి ‘కాంతార’ ప్రీక్వెల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ‘కాంతార:చాప్టర్ 1’ టైటిల్ తోనే ఈ సినిమా రానుంది. ప్రస్తుతం మూవీ షూటింగ్ దశలో ఉంది. హోంబలే ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని 125 కోట్ల బడ్జెట్ తో చేయాలని ముందు భావించారంట.

అయితే ఇప్పుడు బడ్జెట్ మరింత పెరిగినట్లు టాక్ వినిపిస్తోంది. ఏకంగా 150 కోట్ల వరకు ఫైనల్ లెక్కలు తేలే అవకాశం ఉందని టాక్. ఈ సినిమాలోకి కీలక ఎపిసోడ్ కోసం కుండపురలో భారీ సెట్ ని ఏర్పాటు చేసారంట. దీనికి కోట్ల రూపాయిలు ఖర్చయినట్లు సమాచారం. ఈ కారణంగానే ముందు అనుకున్న దానికంటే బడ్జెట్ పెరిగిందని తెలుస్తోంది. బడ్జెట్ కి తగ్గట్లుగానే ఈ సినిమా కోసం స్టార్ యాక్టర్స్ ని రిషబ్ శెట్టి ఎంపిక చేసారంట.

‘కాంతార’ సక్సెస్ తో ప్రీక్వెల్ పైన అంచనాలు భారీగా పెరిగాయి. మూవీ ఎప్పుడు రిలీజ్ అయిన 1000 కోట్ల కలెక్షన్స్ గ్యారెంటీ అని ట్రేడ్ పండితులు అంటున్నారు. అంచనాలు భారీగా ఉండటంతో లార్జర్ దెన్ లైఫ్ అనేలా ఈ సినిమాని రిషబ్ శెట్టి తెరకెక్కిస్తున్నారంట. వచ్చే ఏడాది ‘కాంతారా 2’ని పాన్ ఇండియా లెవల్ లో ఐదు భాషలలో ఒకే సారి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమా హిట్ అయితే రిషబ్ శెట్టి ఇమేజ్ కూడా అమాంతం పెరిగిపోతుంది. దీని తర్వాత అతని నుంచి రాబోయే సినిమాలపై ఎక్స్ పెక్టేషన్స్ హైఎండ్ లో ఉంటాయి. అయితే పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత రిషబ్ శెట్టి దర్శకుడిగా కూడా కొనసాగుతారా కేవలం హీరోగా మాత్రమే చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News