రచయితల్ని సరిగ్గా పట్టించుకోని ఫలితం ఇదీ!
అయితే ఈ సినిమా ఇంతగా ఫ్లాపవ్వడానికి కారణం ఏమిటో కరణ్ విశ్లేషించుకున్నారని తాజాగా అతడి వ్యాఖ్యలు చెబుతున్నాయి.;
సినిమా అంటే క్రియేటివిటీ. ప్రతిదీ నేచురల్ గా ఉండాలని కోరుకుంటే కుదరదు. సినిమాటిగ్గా సీన్లు చూపించాలి. కొన్నిచోట్ల క్రియేటివ్ లిబర్టీ అవసరం. అయితే అలాంటి స్వేచ్ఛను తీసుకున్న కరణ్ జోహార్ సినిమాలను ట్రోలర్స్ అస్సలు క్షమించడం లేదు. తాజాగా కరణ్ జోహార్ నిర్మించిన నాదనియాన్ యూత్ ని థియేటర్లకు రప్పించాలని చేసిన ప్రయత్నం. కానీ వినోదం పండని ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. ఈ సినిమా కథ, కంటెంట్ పరంగా తేలిపోయింది. నటీనటుల ప్రదర్శన కూడా విఫలమైంది. దీంతో కరణ్ పై తీవ్రంగా ట్రోలింగ్ చేసారు.
ఇవి కుచ్ కుచ్ హోతా హై రోజులు కావని నిర్మాత కేజేవోని విమర్శించారు. నాదనియన్ లో ఇద్దరు కాలేజ్ విద్యార్థుల మధ్య లవ్ కెమిస్ట్రీని వర్కవుట్ చేయాలని చూసినా కానీ అది ఎబ్బెట్టుగా కనిపించింది. సీన్లు పండలేదు. రొమాన్స్ వర్కవుట్ కాలేదు. ఫీల్ అన్నదే లేకుండా పోయిందని విమర్శలొచ్చాయి. ముఖ్యంగా ఈ సినిమా నుంచి ఆశించినదేదీ ప్రేక్షకులకు దక్కకపోవడంతో చివరికి ఫ్లాప్ గా ముగిసింది.
అయితే ఈ సినిమా ఇంతగా ఫ్లాపవ్వడానికి కారణం ఏమిటో కరణ్ విశ్లేషించుకున్నారని తాజాగా అతడి వ్యాఖ్యలు చెబుతున్నాయి. రచయితల్ని సరిగా పట్టించుకోకపోవడం, వారు కంటెంట్ పై దృష్టి సారించకపోవడమే వైఫల్యానికి కారణమని ఆయన అంగీకరించారు. కరణ్ జోహార్ ఇంటర్వ్యూలలో బాలీవుడ్ క్షీణ దశలో ఉందని, కంటెంట్ ఆధారిత సినిమాలు మాత్రమే దానిని కాపాడగలవని పేర్కొన్నాడు. రచయితల ప్రాముఖ్యత గురించి, వారిని బాగా చూసుకోవడం సినిమా విజయానికి ఎలా కీలకమో ఆయన పదే పదే మాట్లాడారు. అయితే నాదానియన్ విషయంలో ఆయన ఫెయిలయ్యాడు. ఈ సినిమా రచన పరంగాను విఫలమైంది. కనీసం ఇకనైనా కరణ్ నిర్మించే సినిమాల విషయంలో రచనా విభాగంపై ఎక్కువ దృష్టి సారించాల్సి ఉంటుంది.