ప్రముఖ సీనియర్ నటుడు మృతి
సీనియర్లు అంతా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
ప్రముఖ హాలీవుడ్ నటుడు డొనాల్డ్ సదర్లాండ్ (88) కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన మియామీలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కెనడాకి చెందిన డొనాల్డ్ చిత్ర పరిశ్రమకి ఆరు దశాబ్ధాల పాటు తన సేవల్ని అందించారు. ఆయన మరణంతో హాలీవుడ్ ప్రముఖు లంతా సంతాపం ప్రకటించారు. సీనియర్లు అంతా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
ఓ గొప్ప నటుడిగా ఆయన సేవల్ని కొనియాడు. అలాగే తెలుగు పరిశ్రమ నుంచి నటి సమంత, హిందీ పరిశ్రమ నుంచి కరీనా కపూర్ ఖాన్ నివాళులు అర్పించారు. కరీనా ప్రత్యేకంగా డొనాల్డ్ ఫోటోని షేర్ చేసారు. `ది డర్టీ డజన్` సినిమాతో హాలీవుడ్ లో డొనాల్డ్ సదర్లాండ్ ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత ఎన్నో సినిమా ల్లో నటించారు. ఎన్నో అవార్డులు..రివార్డులు దక్కించుకున్నారు.
`ప్రైమ్ టైమ్ ఎమ్మీ అవార్డ్, గోల్డెన్ గ్లోబ్ అవార్డు, అకాడమీ అవార్డు వంటి ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. ఆయనకు బాలీవుడ్ తోనూ అనుబంధం ఉంది. `ఆర్డీనరీ పీపూల్`, `ఎమ్ ఏ ఎస్ హెచ్ హౌస్`, `దిహంగర్ గేమ్స్` ప్రాంచైజీ, `మూన్ ఫాలో` వంటి సినిమాలతో బాలీవుడ్ సినిమాలతోనూ ఇక్కడ ప్రసిద్ది చెందారు. ఆయన చివరిగా గత ఏడాది రిలీజ్ అయిన హంగర్ గేమ్స్ లో నటించారు.
ఆ సినిమా ఆయనకు మరింత గుర్తింపును తీసుకొచ్చింది. వైవిథ్యమైన పాత్రలకు పెట్టింది పేరుగా ఇక్కడా ఖ్యాతికెక్కుతున్నారు. భారతీయ సినిమాలంటే ఆయనకు ఎంతో మక్కువ. ఇక్కడ సినిమాల్లో బలమైన ఎమోషన్ ఉంటుందని ఎన్నో సందర్భాల్లో అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఎమోషన్ ఇతర భాషల చిత్రాలకు సాధ్యం కాదని అనేవారు. ప్రపంచ వ్యాప్తంగా భారతీయ సినిమాలకు ప్రత్యేకమైన తన లాంటి అభిమాను లెంతో మంది విదేశాల్లో ఉన్నారని పలు సందర్బాల్లో డొనాల్డ్ అన్నారు.