అతడు తప్పించినా ఉవ్వెత్తున దూసుకొచ్చాడు!
బాలీవుడ్ లో అప్పుడప్పుడే యువ హీరో కార్తీక్ ఆర్యన్ నిలదొక్కుకుంటున్నారు. అగ్ర నిర్మాణ సంస్థల్లో పని చేసే అవకాశాలు అందుకుంటోన్న సమయం.
బాలీవుడ్ లో అప్పుడప్పుడే యువ హీరో కార్తీక్ ఆర్యన్ నిలదొక్కుకుంటున్నారు. అగ్ర నిర్మాణ సంస్థల్లో పని చేసే అవకాశాలు అందుకుంటోన్న సమయం. సరిగ్గా అదే సమయంలో కరణ్ జోహార్ నిర్మించిన `దోస్తానా-2 ` లో కార్తీక్ హీరోగా ఎంపికయ్యాడు. కొంత షూటింగ్ కూడా చేసారు. కానీ ఇంతలోనే ఆ పాత్రకి కార్తీక్ సెట్ అవ్వలేదని కరణ్ నిర్యాక్షణ్యంగా కార్తీక్ ని తొలగించాడు. కార్తీక్ ని ఇలా తొలగించడంపై రకరకాల ప్రచారా లు తెరపైకి వచ్చాయి.
అయితే ఈ విషయంలో ఎక్కువగా నెగటివ్ అయింది మాత్రం కరణ్ జోహార్. షూటింగ్ మధ్యలో నుంచి కార్తీక్ ని తప్పించడంపై సోషల్ మీడియా వేదికగా యువ హీరో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసారు. దీంతో కార్తీక్ మళ్లీ కోలుకోవడం కష్టమనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. కరణ్ లాంటి నిర్మాత తప్పించా డంటే మళ్లీ ఏ నిర్మాత అవకాశాలిస్తాడు? కరణ్ మాట కాదని అతన్ని ప్రోత్సహిస్తారా? అని రకరకాల సందేహాలు తెరపైకి వచ్చాయి.
ఇండస్ట్రీ అంతా ఓ వైపు ఉంటే ..కార్తీక్ ఒక్కడే ఏకాకిలా మారాడు. ఇప్పుడతని కెరీర్ పరిస్థితి ఏంటి? అని నీలి నీడలు కమ్ముకున్నాయి.కానీ తనకు పరాభవం ఎదురైన కొద్దిరోజుల్లోనే కార్తీక్ `భూల్ భులయా 2` రూపంలో ఛాన్స్ రావడం అది భారీ విజయాన్ని సాధించడంతో ఒక్కసారిగా అతడి జీవితంలో వెలుగులు నిండాయి. పరిశ్రమ కేవలం ఇన్ సైడర్స్ కి మాత్రమే కాదు..మాఫియా కనుసన్నల్లో మెలిగే వారికి మాత్రమే కాదని నిరూపించాడు.
ఓ ఔట్ సైడర్ గా ఎంట్రీ ఇచ్చి ఓ వెలుగు వెలిగాడు. సరిగ్గా అదే సమయంలో క్వీన్ కంగన సైతం కార్తీక్ కి మద్ధ తుగా నిలిచింది. ఆ విజయం తర్వాత వరుసగా అవకాశాలు అందుకుని బిజీ అయ్యాడు. అప్పటి వరకూ కార్తీక్ ఏడాదికి ఒక సినిమా మాత్రమే చేస్తే ఆ సంఘటన తర్వాత ఏడాదికి రెండు సినిమాలు చొప్పున రిలీజ్ చేసాడు. ప్రస్తుతం `చందు చాంఫియన్` సినిమా చేస్తున్నాడు. అలాగే `భూల్ భులయ్య-3` లో కూడా కార్తీక్ నే హీరోగా ఎంపికయ్యాడు. కొత్త అవకాశాలు వస్తున్నాయి.