బ్రౌన్ డిజైన్ లో క‌ళాక‌వ‌తి క‌వ్వింపు!

తాజాగా ఇన్ స్టాలో మ‌రో పిక్ వ‌దిలింది. ఇందులో అమ్మ‌డు ఒళ్లంతా క‌ప్పేసిన డిజైనర్ దుస్తుల్లో త‌ళుక్కున మెరిసింది. బ్రౌన్ రంగు డిజైన్ లో అమ్మ‌డు త‌న‌దైన మార్క్ అప్పిరియ‌న్స్ తో ఆక‌ట్టుకుంది.

Update: 2024-06-24 05:15 GMT

 

కీర్తీ సురేష్ ఆన్ స్క్రీన్ పై గ్లామ‌ర్ డోస్ పెంచిన సంగ‌తి తెలిసిందే. పాత్ర ప‌రంగా ఎంత‌వ‌ర‌కూ న‌టించాలో? అంత‌వ‌ర‌కూ పూర్తిగా న్యాయం చేస్తుంది. మునుప‌టిలా మ‌డిక‌ట్టుకుని కూర్చుంటే వ‌చ్చే అవ‌కాశాలు రావ‌ని మారిందా? ద‌ర్శ‌కుల ఒత్తిడి కారణ‌మా? అన్న‌ది ప‌క్క‌న‌బెడితే మార్పు తో కొత్త అవ‌కాశాలు బాగానే అందు కుంటుంది. కొంత‌వ‌ర‌కూ త‌న‌లో ఛేంజోవ‌ర్ ప్రోఫెష‌న‌ల్ గా క‌లిసొచ్చింది.

 

కానీ ఆఫ్ ది స్క్రీన్ మాత్రం అమ్మ‌డు రూల్స్ ఎక్క‌డా బ్రేక్ చేయ‌డం లేదు. ఫ‌రిది దాటి గ్లామ‌ర్ షో చేస్తు న్న‌ట్లు ఇంత‌వ‌ర‌కూ ఎక్క‌డా దొరక‌లేదు. నెట్టింట షేర్ చేసే ఫోటోల్లో త‌న క‌ట్టుబాట్ల‌ను మాత్రం తూచ త‌ప్ప‌కుండా పాటిస్తూనే ఉంది. అందాలు క‌నిపించే డ్రెస్ లకంటే డ్రెస్ తోనే అందం తీసుకొచ్చే పాల‌సీతో ముందుకెళ్తుంది. ఆఫ్ ది స్క్రీన్ లో స్కిన్ షో...క్లీవేజ్ షో వంటి వాటికి తొలి నుంచి దూరంగానే ఉంది.

 

ఇప్ప‌టికీ అదే మెయింటెన్ చేస్తోంది. తాజాగా ఇన్ స్టాలో మ‌రో పిక్ వ‌దిలింది. ఇందులో అమ్మ‌డు ఒళ్లంతా క‌ప్పేసిన డిజైనర్ దుస్తుల్లో త‌ళుక్కున మెరిసింది. బ్రౌన్ రంగు డిజైన్ లో అమ్మ‌డు త‌న‌దైన మార్క్ అప్పిరియ‌న్స్ తో ఆక‌ట్టుకుంది. అమ్మ‌డి మ్యాక‌ప్, అలంక‌ర‌ణ ప్ర‌తీది మ‌రింత అందంగా తీర్చి దిద్దాయి. ముఖ్యంగా చెవుల‌కు ధ‌రించిన గోలుసుల్ని పోలిన చెవులీలు సంథింగ్ స్పెష‌ల్ గా ఫోక‌స్ అవుతున్నాయి.

 

 

క‌ళావ‌తి డ్రెస్ కంటే చెవులీలే హైలైట్ అవుతున్నాయి. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. సొగ‌స‌రి అభిమానులు కీర్తి అందాన్ని పొగిడేస్తూ ఎవ‌రి స్టైల్లో వారు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. కీర్తి కెరీర్ అయిపోయింది అనుకుంటోన్న స‌మ‌యంలో అమ్మ‌డు ఎలా కంబ్యాక్ అయిందో తెలిసిందే. హీరోయినే అనే ఇమేజ్ ని ప‌క్క‌న‌బెట్టి సిస్ట‌ర్ పాత్ర‌ల‌కు సిద్ద‌మై ఉనికిని కాపాడుకుంది. దీంతో మ‌ళ్లీ హీరోయిన్ ఛాన్సులు పుంజుకున్నాయి. ప్ర‌స్తుతం కీర్తి సురేష్ ఖాతాలో తెలుగు, హిందీ ప్రాజెక్ట్ లు ఉన్న సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News