మోడ్రన్ చీర బ్లౌజ్‌లో ఖుషి హొయలు
ఈ చీరకు తగ్గట్టే డిజైనర్ బ్లౌజ్ కాంబినేషన్ ఆభరణాలతో ఖుషి ధగధగా మెరిసిపోతోంది.
ఆధునికంగా ఉండాలి.. సాంప్రదాయానికి కించిత్ భంగం కలగకూడదు. చూడగానే హుందాగా ఉంటూనే, నేటి జెన్ జెడ్ స్టైల్ ని ఆవిష్కరించడమెలానో ఇదిగో ఇక్కడ ఖుషి కపూర్ చీర లుక్ చూస్తే అర్థమవుతుంది. క్లాసీగా కనిపిస్తూనే, స్టన్నర్ అనిపించింది. ఖుషీకపూర్ మాస్టర్ క్లాస్ డిజైనర్ శారీ హెడ్ టర్నర్ అని పొగిడేస్తే తప్పేమీ కాదు. ఈ చీరకు తగ్గట్టే డిజైనర్ బ్లౌజ్ కాంబినేషన్ ఆభరణాలతో ఖుషి ధగధగా మెరిసిపోతోంది.
ఖుషి నటించిన 'లవ్‌యాపా' విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రచారంలో ఖుషి చాలా బిజీగా ఉంది. అదే సమయంలో తనలోని స్టైల్ కంటెంట్ ని అన్నివిధాలుగా ఎలివేట్ చేస్తూనే ఉంది. వీలున్న ప్రతి వేదికపైనా డిజైనర్ లుక్స్ పరంగా కొత్తదనం కోసం ప్రయత్నిస్తోంది. చీరలో, డిజైనర్ కుర్తాలు, మోడ్రన్ దుస్తుల్లో, బికినీల్లో ఖుషి ఫోజులు వైరల్ అవుతూనే ఉన్నాయి.
ఖుషి కపూర్ ది ఆర్చీస్ తో నటిగా పరిచయమైంది. ఇప్పుడు లవ్ యాపాతో పెద్దతెరకు పరిచయమవుతోంది. ఇంతకుముందే లవ్ యాపాను ప్రమోట్ చేసే ఒక క్రియేటివ్ వీడియోని ఖుషి స్వయంగా లాంచ్ చేయగా అది వైరల్ గా మారింది. ఇందులో అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ కథానాయకుడిగా నటించాడు. ఇది తమిళ హిట్ చిత్రం లవ్ టుడే కి అధికారిక రీమేక్. పాటలు పోస్టర్లు, ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాతో విజయం సాధిస్తే, ఖుషీకి అది గుడ్ స్టార్ట్ అవుతుంది. ఏం జరగనుందో వేచి చూడాలి.