అంబానీ ఎవరో తెలీదు.. గాయని వ్యాఖ్యల దుమారం
అయితే అమెరికన్ రియాలిటీ టీవీ స్టార్స్ కిమ్ & ఖోలే తాజా వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ వారం ప్రసారమైన వారి హిట్ షో `ది కర్దాషియన్స్` తాజా ఎపిసోడ్ ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిగ్గా మారింది.;
గత ఏడాది ప్రపంచ కుభేరుడు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ జంట వివాహం అంగరంగ వైభవంగా సాగిన సంగతి తెలిసిందే. మూడు దఫాలుగా కొన్ని నెలల పాటు సాగిన ఈ వివాహ వేడుకల కోసం అంబానీలు ఏకంగా 5000 కోట్లు పైగా ఖర్చు చేయడం సంచలనమైంది. ఈ పెళ్లి వేడుకలో పలువురు పాప్ సింగర్లు పెర్ఫామ్ చేసారు. తమ ప్రదర్శనల కోసం కోట్లాది రూపాయల పారితోషికాలు అందుకున్నారు. పాప్ గాయకుడు జస్టిన్ బీబర్ అత్యధికంగా 83 కోట్లు అందుకోగా, పాప్ గాయని రిహానా 50 కోట్లు అందుకుందని కథనాలొచ్చాయి. రియాలిటీ టీవీ స్టార్స్ కిమ్ కర్ధాషియన్ - ఖోలే కర్ధాషియన్ సోదరీమణులు కూడా ఈ పెళ్లిలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. సిస్టర్స్ ఇద్దరికీ అంబానీలు పెద్ద మొత్తంలో ముట్ట జెప్పారని గుసగుసలు వినిపించాయి.
అయితే అమెరికన్ రియాలిటీ టీవీ స్టార్స్ కిమ్ & ఖోలే తాజా వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ వారం ప్రసారమైన వారి హిట్ షో `ది కర్దాషియన్స్` తాజా ఎపిసోడ్ ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిగ్గా మారింది. ఆశ్చర్యకరంగా, కిమ్ తనకు అంబానీ కుటుంబం గురించి తెలియదని వ్యాఖ్యానించింది. సుమారు రూ.5000 ($600 మిలియన్ల డాలర్లు) కోట్లు ఖర్చుతో అత్యంత విలాసవంతంగా సాగించిన ఈ పెళ్లి వేడుకకు హాజరవ్వడం కిమ్ కి మరపురాని అనుభవం. ఒక పరస్పర స్నేహితుడి ద్వారా తమకు ఆహ్వానం అందిందని, ఆ పెళ్లికి వెళ్లాలా వద్దా అనేది ఆకస్మిక నిర్ణయమని కిమ్ వెల్లడించారు.
ఎపిసోడ్‌లో కిమ్ మాట్లాడుతూ.. నిజానికి నాకు అంబానీలు ఎవరో తెలియదు. మాకు ఉమ్మడి స్నేహితుల ద్వారా పరిచయం అని కిమ్ వ్యాఖ్యానించారు. కర్దాషియన్ సోదరీమణులను ముంబైకి తీసుకువచ్చిన సంబంధం ప్రఖ్యాత ఆభరణాల వ్యాపారి లోరైన్ స్క్వార్ట్జ్. అంబానీ కుటుంబానికి నగలు డిజైన్ చేసే సన్నిహితులు లోరైన్. లోరైన్ స్క్వార్ట్జ్ మా మంచి స్నేహితుల్లో ఒకరు. ఆమె ఒక ఆభరణాల వ్యాపారి. ఆమె అంబానీ కుటుంబానికి నగలు చేస్తుంది. ఆమె వారి వివాహానికి వెళుతున్నానని నాకు చెప్పింది. వారు మిమ్మల్ని ఆహ్వానించడానికి ఇష్టపడతారని ఆమె చెప్పారని కిమ్ తెలిపారు.
కిమ్ కర్ధాషియన్- ఖోయ్‌లే కర్ధాషియన్ సిస్టర్స్ కి ఇతర ఆహ్వానంలా కాకుండా ప్రత్యేకమైన ఆహ్వానం అందింది. 40-50 పౌండ్లు ఖరీదు చేసే ఖరీదైన ఆహ్వానపత్రిక.. దాని నుండి సంగీతం హృదయాలను తాకిందని కిమ్ కర్ధాషియన్ ఈ రియాలిటీ షోలో తెలిపింది. 18 నుంచి 22 కిలోల మధ్య బరువున్న ఈ విలాసవంతమైన ఆహ్వాన పత్రిక ఒక కళాఖండం. అంబానీల వైభవాన్ని సూచించేలా ఇది పిచ్చిగా ఉంది! అని ఖోయ్ లే వెల్లడించారు. మేము ఆహ్వానాన్ని చూసినప్పుడు ఇలాంటి వాటికి నో చెప్పకూడదని భావించాము అని తెలిపారు. అయితే అంబానీలు ఎవరో తెలీదు! అని కిమ్ దురుద్ధేశంతో వ్యాఖ్యానించలేదు. కేవలం తనకు ఉమ్మడి స్నేహితుల ద్వారా తెలుసు అని మాత్రమే వ్యాఖ్యానించారు. నిజానికి కిమ్- ఖోలే సిస్టర్స్ అంబానీల వైభవాన్ని ప్రశంసించారు.
బిలియనీర్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ -రాధిక మర్చంట్ వివాహం 12 జూలై 2024న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగింది. ఈ వేడుకల్లో రిహన్న, దిల్జిత్ దోసాంజ్, షారుఖ్ ఖాన్ దిగ్గజాల ప్రదర్శనలతో సందడిగా సాగింది. ప్రీ-వెడ్డింగ్ ఈవెంట్‌లతో నెలల తరబడి జరిగిన వేడుకల అనంతరం పెళ్లి వైభవంగా సాగింది. కిమ్ - ఖోయ్‌లే ఈ వేడుకల్లో భారతీయ వస్త్రధారణలతో కళ్లు చెదిరే ట్రీటిచ్చారు. మనీష్ మల్హోత్రా రూపొందించిన అద్భుతమైన భారతీయ లెహంగాలను ధరించి, లోరైన్ స్క్వార్ట్జ్ రూపొందించిన ఆభరణాలతో అలంకరించారు.