అమీర్ ఖాన్ (X) కిరణ్ రావు: సౌత్ సినిమాపై నోరు జారారు!
అయితే కిరణ్ రావు కామెంట్ సరైనదేనా? సౌత్ ని సరిగా అర్థం చేసుకున్నారా? అంటే.. నిజంగా ఇది ఆలోచింపజేసేదే.;
ఓవైపు సౌత్ సినిమాని మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ పొగిడేస్తుంటే, మరోవైపు అతడి మాజీ భార్య కిరణ్ రావు తక్కువ చేసి మాట్లాడటం నెటిజనుల్లో చర్చగా మారింది. ప్రముఖ దర్శకురాలు కిరణ్ రావు తాజా ఇంటర్వ్యూలో సౌత్ వర్సెస్ బాలీవుడ్ డిబేట్ లో పాల్గొన్నారు. హిందీ సినిమాలను దేశవ్యాప్తంగా ఉన్న విస్త్రత ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని తీస్తున్నారని, దాని కోసం ప్రత్యేకమైన కథల్ని ఎంపిక చేసుకుంటున్నారని కిరణ్ రావు అన్నారు. దక్షిణాదిన కేవలం పరిమిత ఆడియన్స్ ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని కథల్ని ఎంపిక చేస్తున్నారని అన్నారు.
అయితే కిరణ్ రావు కామెంట్ సరైనదేనా? సౌత్ ని సరిగా అర్థం చేసుకున్నారా? అంటే.. నిజంగా ఇది ఆలోచింపజేసేదే. నిజానికి బాలీవుడ్ లో హిందీ ఆడియెన్ డయాస్పోరాను దృష్టిలో పెట్టుకుని తీసినా లోకల్(ఉత్తరాదిన)గా కూడా సరిగా ఆడటం లేదు. అలా కాకుండా సౌత్ లో తీసిన మసాలా సినిమాలు కేవలం లోకల్ ఆడియన్స్కే కాకుండా ఉత్తరాది ఆడియన్స్ కి గొప్పగా నచ్చుతున్నాయి. ఆర్.ఆర్.ఆర్-కేజీఎఫ్, పుష్ప సినిమాలే దీనికి ఉదాహరణ. అలాంటి సినిమాలను తీయడంలో బాలీవుడ్ విఫలమైందని అమీర్ ఖాన్ అభిప్రాయపడ్డారు. మూలాలను వదిలేసి బాలీవుడ్ సినిమాలు తీస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ కిరణ్ రావు అభిప్రాయం దీనికి భిన్నంగా ఉంది.
దీని అర్థం.. కిరణ్ రావు ఆలోచనలకు అమీర్ ఖాన్ ఆలోచనలకు మధ్య సింక్ కుదరలేదని భావించాలి. కిరణ్ రావు సరిగా సౌత్ సినిమాని అర్థం చేసుకోలేదు.. అదే సమయంలో అమీర్ ఖాన్ వాస్తవాల్ని ఉన్నదున్నట్టు సవ్యంగా విశ్లేషించారు. సౌత్ సినిమా గురించి ఇప్పుడు బాలీవుడ్ మేకర్స్ విమర్శించడం అనవసరం. `కల్కి 2898 ఏడి` లాంటి సినిమాని నాగ్ అశ్విన్ అంతర్జాతీయ స్టాండార్డ్స్ తో రూపొందించారు. ఇది యూనివర్శల్ యాక్సెప్టెన్సీ ఉన్న కథ. ఇది కూడా సౌత్ నుంచే వచ్చింది కదా! రాజమౌళి బాహుబలి- బాహుబలి 2, ఆర్.ఆర్.ఆర్ హాలీవుడ్ స్టాండార్డ్స్ ఉన్న విజువల్స్ తో వచ్చిన సినిమాలు. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్, కేజీఎఫ్ 2 చిత్రాల్ని హాలీవుడ్ స్టాండార్డ్స్ లో తీసారు. మసాలా కథల్ని తీసినా అన్నివర్గాల ప్రజలకు నచ్చే సినిమాలు కేవలం దక్షిణాదిన మాత్రమే తీయగలరని నిరూపణ అయింది. దీనిని కిరణ్ రావు అర్థం చేసుకోలేకపోయారు. అదే సమయంలో అమీర్ ఖాన్ వాస్తవాన్ని ఉన్నదున్నట్టు విశ్లేషించారు. ఒకవేళ సౌత్ ని విమర్శించదలిస్తే.. కిరణ్ రావు తన తదుపరి చిత్రంతో పాన్ ఇండియా కేటగిరీలో నిరూపించాల్సి ఉంటుంది. నిరూపించే దమ్ముందా?