సినిమాల్లో ఈ షో బెటరేమో క్యూటీ..!

కొత్త దర్శకుడు.. కొత్త హీరో.. కొత్త హీరోయిన్.. కానీ దాని వెనక స్టార్ డైరెక్టర్ హ్యాండ్ ఉండటంతో ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

Update: 2024-12-27 03:49 GMT

కొత్త దర్శకుడు.. కొత్త హీరో.. కొత్త హీరోయిన్.. కానీ దాని వెనక స్టార్ డైరెక్టర్ హ్యాండ్ ఉండటంతో ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమా డైరెక్టర్ కి నెక్స్ట్ గ్లోబల్ స్టార్ ఆఫర్ వచ్చింది. ఆ హీరోకి వరుస సినిమా ఛాన్స్ లు వచ్చాయి. కెరీర్ కాస్త అటు ఇటుగా ఉన్నా హీరోగా తను సెట్ రైట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. ఐతే ఆ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ కొట్టిన ఆ అమ్మడు మాత్రం స్పీడ్ స్పీడ్ గా ఐదారు సినిమాలు చేసి వాటి ఫలితాల వల్ల కెరీర్ రిస్క్ లో పడేసుకుంది.

 

ఇంతకీ ఎవరా హీరోయిన్ అన్నది ఈపాటికే గెస్ చేసి ఉండొచ్చు. ఎస్ అవును.. ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కృతి శెట్టి బేబమ్మగా ఆ పాత్రలో యూత్ ఆడియన్స్ కి ఫేవరెట్ అయ్యింది. ఐతే ఆ సినిమా హిట్ తో టాలీవుడ్ కి మరో స్టార్ హీరోయిన్ క్వాలిటీస్ ఉన్న కథానాయిక వచ్చిందని అనుకోగా ఆ తర్వాత చేసిన సినిమాలు వర్క్ అవుట్ కాలేదు. ఎంట్రీ ఇవ్వడం హిట్టు కొట్టడం కెరీర్ గ్రాఫ్ పడిపోవడం ఇలా అంతా జరిగిపోయింది.

అందుకే ఈమధ్య అమ్మడు ఫోటో షూట్స్ తో గాలం వేస్తుంది. అటు ఫాలోవర్స్ పెంచుకోవడమే కాకుండా తన గ్లామర్ షోతో ఎట్రాక్ట్ చేయాలని చూస్తుంది. ఇప్పటివరకు చేసిన సినిమాల్లో గ్లామర్ పరంగా గీత దాటని అమ్మడు లేటెస్ట్ ఫోటో షూట్స్ లో స్లీవ్ లెస్ షోతో ఆకట్టుకుంటుంది. ఇక మీదట సినిమాల్లో గ్లామర్ షోకి రెడీ అనే హింట్ ఇస్తూ అమ్మడు ఇలా చేస్తుందా అనుకుంటున్న వారు ఉన్నారు. రోజుకొక ఫోటో షూట్ తో కృతి సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంది.

అమ్మడి ప్లానింగ్ లో భాగంగానే ఇలా చేస్తుందా లేదా అన్నది తెలియదు కానీ కృతి శెట్టి స్లీవ్ లెస్ పిక్స్ మాత్రం ఆమెకు మంచి మైలేజ్ పెంచేస్తున్నాయి. ఐతే ఆడియన్స్ కూడా ఈ గ్లామర్ షో ఏదో సినిమాల్లో చేస్తే కాస్త క్రేజ్ పెరుగుతుంది కదా అని కామెంట్స్ పెడుతున్నారు. ఏది ఏమైనా కృతి శెట్టి ఫోటో షూట్స్ కి స్పెషల్ క్రేజ్ ఏర్పడుతుండగా ఆమెను ఇష్టపడే ఫ్యాన్స్ ఈ ఫోటోలతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. బేబమ్మ కెరీర్ లో మరో హిట్ పడే దాకా అమ్మడికి ఈ కష్టాలు తప్పేలా లేవు.

Tags:    

Similar News