ఉత్తమ నటుడి సినిమా కోసం ఉత్తమ నటి ఎగ్జైట్ మెంట్!
తాజాగా ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 'పుష్ప-2' కోసం ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నట్లు తెలిపింది.
69వ జాతీయ అవార్డు వేడుకల్లో బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ మిమీ సినిమాకు గాను ఉత్తమ నటి అవార్డు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. తన నటనకు గుర్తింపుగానూ ఈ అరుదైన గౌరవం దక్కింది. చాలా తక్కువ సమయంలోనే జాతీయ అవార్డు అందుకున్న నటిగా నిలిచింది. ఎంతో మంది సీరియర్ భామలు ..తనకంటే ముందు..వెనుక వచ్చిన వారెంతో మంది ఉన్నారు. కానీ వాళ్లెవ్వరిని వరించని అదృష్టం అమ్మడిని వరించింది.
ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు సూపరిచితమే. కృతిసనన్ తెరంగేట్రం తెలుగు సినిమా 'వన్ నేనొక్కిడినే' తో జరిగింది. ఈ సినిమా ద్వారా అవకాశం కల్పించింది దర్శకుడు సుకుమార్. ఆ తర్వాత అక్కినేని వారసుడు నాగచైతన్య సరసన 'దోచెయ్' లో నటించింది. ఈ రెండు సినిమాల తర్వాత బాలీవుడ్ కి వెళ్లిపోయింది. ఇక్కడ అవకాశాలు రాకపోవడం సహా ..హిందీపై మక్కువతో అక్కడే ప్రయత్నాలు చేసి సక్సెస్ అయింది.
ప్రస్తుతం అక్కడ బిజీ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది. జాతీయ అవార్డుల్లో భాగంగా సుకుమార్ దర్శకత్వం వహించిన 'పుష్ప' ద్వారా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఉత్తమ నటుడి అవార్డు వరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 'పుష్ప-2' కోసం ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నట్లు తెలిపింది. తనకు బాగా తెలిసిన దర్శకుడు చిత్రానికి అవార్డు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది.
తనకిష్టమైన దర్శకుల్లో ఒకరిగా సుకుమార్ ని చెప్పుకొచ్చింది. ఆయనపై ఎల్లప్పుడు ప్రేమ.గౌరవ ఉంటుందని ట్వీట్ చేసింది. అలాగే బన్నీకి కూడా విషెస్ తెలియజేసింది. ఇక ఉత్తమ నటి..నటుడు ఇద్దరు వృత్తి పరంగా ఎంత బిజీగా ఉన్నారో ? చెప్పాల్సిన పనిలేదు. కృతిసనన్ ఇటీవల నిర్మాణ రంగంలోకి కూడా దిగింది. కాజోల్ అగర్వాల్ తో ఓ సినిమా నిర్మిస్తోంది. అందులో ఆమె ఓ కీలక పాత్రలో మెప్పించనుంది.