మెగా కోడలు లావణ్య స్టన్నింగ్ లుక్
లవ్‌బర్డ్స్ లావణ్య త్రిపాఠి - వరుణ్ తేజ్ లండన్‌లో సంతోషకరమైన విరామాన్ని ఆస్వాధిస్తున్నారు.
పచ్చ రంగు టాప్.. షేడెడ్ డెనిమ్స్ లో కొణిదెల కోడలు లావణ్య త్రిపాఠి అల్ట్రా స్టైలిష్ లుక్ ఇప్పుడు అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది. ఈ లుక్ చూడగానే అభిమానులు లావణ్య మెస్మరైజింగ్! అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. గత కొద్దిరోజులుగా హబ్బీ వరుణ్ తేజ్ తో కలిసి ఈ భామ లండన్ విహారంలో చిల్లింగ్ గా కనిపిస్తోంది. తన కళ్లకు రేబాన్ ధరించి స్టైలిష్ గా కనిపిస్తోంది. తాజా ఫోటోగ్రాఫ్స్‌లో మరింత అందంగా కనిపిస్తోంది లావణ్య.
లవ్‌బర్డ్స్ లావణ్య త్రిపాఠి - వరుణ్ తేజ్ లండన్‌లో సంతోషకరమైన విరామాన్ని ఆస్వాధిస్తున్నారు. ఈ జంట నగరంలోని సుందరమైన వీధులను అన్వేషించడం, దాని ఆకర్షణలో మునిగిపోవడం.. రకరకాల మార్గాల గుండా వెళుతూ అరుదైన జ్ఞాపకాలను సొంతం చేసుకుంటున్నారు.
లావణ్య ఇటీవల అద్భుతమైన ఎరుపు రంగు స్వెటర్‌లో క్లాసిక్ రెడ్ టెలిఫోన్ బూత్ పక్కన ఉల్లాసభరితమైన భంగిమలో కనిపించింది. లండన్ బ్రిడ్జి కూలుతోంది అంటూ కంగారు పెట్టేసింది. లావణ్య ఈ ట్రిప్ ని జాలీగా గడిపేస్తోంది. తమ విహారం నుంచి ఏ ఒక్క ఫోటోని దాచుకోకుండా షేర్ చేస్తోంది లావణ్యం. తదుపరి వరుణ్ , లావణ్య ఎవరికి వారు తమ కమిట్ మెంట్లను ఫుల్ ఫిల్ చేయాల్సి ఉంది. ఆపరేషన్ వేలెంటైన్ తర్వాత మట్కా చిత్రంతో మెగా ప్రిన్స్ అభిమానుల ముందుకు వస్తున్నాడు.