మా ఊరి పొలిమెర 2.. అల్లు అరవింద్ స్పెషల్ విషెస్

'మా ఊరి పొలిమెర' చిత్రానికి సీక్వెల్‌గా 'మా ఊరి పొలిమెర 2' నవంబర్ 3న థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే

Update: 2023-11-09 15:37 GMT

'మా ఊరి పొలిమెర' చిత్రానికి సీక్వెల్‌గా 'మా ఊరి పొలిమెర 2' నవంబర్ 3న థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. సత్యం రాజేష్ మరియు కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలలో నటించిన ఈ క్రైమ్ మరియు మిస్టరీ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద సాలీడ్ కలెక్షన్లు అందుకుంటోంది. ఇప్పటికే సినిమాపై పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చింది. ఇక ప్రస్తుతం ప్రాఫిట్ లో కొనసాగుతున్న పొలిమేర 2 సినీ పెద్దల ప్రశంసలు కూడా అందుకుంటోంది.

దర్శకుడు అనిల్ విశ్వనాథ్ ఈ సినిమాను ఎంతో థ్రిల్లింగ్ గా మంచి ట్విస్ట్ లతో తెరకెక్కించడంతో మొదటి రోజే మౌత్ టాక్ ద్వారా సినిమాకు కలెక్షన్స్ పెరుగుతూ వచ్చాయి. నిర్మాత గౌర్ క్రిష్ణ అంతకుమించి అనేలా సాలీడ్ హిట్ కొట్టారు. దీంతో సినిమాపై ప్రముఖులు ప్రశంసలు అందిస్తున్నారు.

అయితే గీతా ఆర్ట్స్‌ కాంపౌండ్‌కి చెందిన వంశీ నందిపాటి ఈ సినిమాను థియేట్రికల్ గా గ్రాండ్ గా విడుదల చేశారు. అతను ఈ ప్రత్యేకమైన కంటెంట్‌ను ఇష్టపడి గ్రాండ్ విడుదల చేశాడు. ఫ్యాన్సీ ధర చెల్లించి చిత్రం యొక్క ప్రపంచవ్యాప్త థియేట్రికల్ హక్కులను కొనుగోలు చేశాడు. థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది.

ప్రేక్షకులు మరియు విమర్శకుల నుండి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడంతో చాలా ఏరియాలలో హౌస్‌ఫుల్ అయింది. ఇక గీతా ఆర్ట్స్ అధినేత ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన మొదటి ప్రయత్నంలోనే చిరస్మరణీయమైన హిట్ కొట్టినందుకు నందిపతి వంశీని వ్యక్తిగతంగా అభినందించారు. దేశీయంగా మరియు ఓవర్సీస్‌లో తొలి వారంలోనే ఈ బ్లాక్‌బస్టర్ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి.

ఇక అల్లు అరవింద్ డిస్ట్రిబ్యూటర్ పనితనాన్ని మెచ్చుకున్నారు. ఇక సినిమాను కమర్షియల్‌గా హిట్ చేసినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపేందుకు 'మా ఊరి పొలిమెర 2' టీమ్ నవంబర్ 10 నుంచి ఆంధ్రాలో పర్యటించనుంది. ఇక ఈ సినిమాకు పార్ట్ 3 పార్ట్ 4 కూడా ఉంటాయి అని దర్శకుడు ఇదివరకే క్లారిటీ ఇచ్చాడు. సినిమాలో కూడా ఊహించిన ట్విస్టు లతో ఎండ్ కార్డు పెట్టేసి రాబోయే ప్రాజెక్టులపై మరింత ఆసక్తిని కలిగించారు. ఇక మా ఊరి పొలిమేర వచ్చే ఏడాది విదల కావచ్చు అని సమాచారం.

Tags:    

Similar News