ఆ ప్రొడక్షన్ లోనే ఎనిమిది దెయ్యాలు..

బాలీవుడ్ లో గత ఏడాది ‘ముంజ్య’, ‘స్త్రీ 2’ సినిమాలు రెండు సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. మ్యాడ్‌డాక్ ఫిలిమ్స్ నుంచి ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి

Update: 2025-01-03 07:49 GMT

బాలీవుడ్ లో గత ఏడాది ‘ముంజ్య’, ‘స్త్రీ 2’ సినిమాలు రెండు సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. మ్యాడ్‌డాక్ ఫిలిమ్స్ నుంచి ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. హర్రర్ యూనివర్స్ లో భాగంగా ఈ ప్రొడక్షన్ హౌస్ ఈ చిత్రాలని నిర్మించింది. ఈ మూవీస్ ద్వారా నిర్మాతలకి 1000 కోట్లకి పైగా కలెక్షన్స్ వచ్చాయి. ‘స్త్రీ 2’ మూవీ చిత్రాన్ని 50 కోట్లతో నిర్మించగా వరల్డ్ వైడ్ గా 800 కోట్లకి పైగా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది.

ఇదిలా ఉంటే మ్యాడ్‌డాక్ ఫిలిమ్స్ లో హర్రర్ యూనివర్స్ నుంచి ఏకంగా 8 సినిమాలని మేకర్స్ ఎనౌన్స్ చేశారు. ప్రతి ఏడాది 2 సినిమాలని థియేటర్స్ లోకి తీసుకొని రాబోతున్నట్లు తెలిపారు. ఏకంగా నాలుగు సంవత్సరాల షెడ్యూల్ ని ప్రకటించారు. ఇవన్నీ మినిమమ్ రేంజ్ బడ్జెట్ తోనే తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాల జాబితా చూసుకుంటే 2025లో ‘థమ’, ‘శక్తి షాలిని’ అనే సినిమాలని థియేటర్స్ లోకి తీసుకొని రాబోతున్నారు.

2026లో ‘భేడియా 2’, ‘చాముండ’ సినిమాలని తీసుకురానున్నారు. 2027లో ‘స్త్రీ 3’, ‘మహా ముంజ్య’ సినిమాలు రానున్నాయి. 2028లో ‘పెహలా మహాయోధ్’, ‘దూస్రా మహాయోధ్’ సినిమాలని తీసుకురానున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఇవన్నీ కూడా హర్రర్ థ్రిల్లర్ జోనర్ లోనే తెరకెక్కబోతున్నాయి. మ్యాడ్ డాక్ ఫిలిమ్స్ వారికి ఈ హర్రర్ ఫ్రాంచైజ్ బాగా వర్క్ అవుట్ అవుతోంది.

హిందీ ఆడియన్స్ కూడా ఈ చిత్రాలని విపరీతంగా ఆదరిస్తున్నారు. అందుకే మేకర్స్ ఈ యూనివర్స్ లో వరుసగా సినిమాలు ప్రకటించారు. హిందీలో కార్తిక్ ఆర్యన్ హీరోగా వచ్చిన ‘భూల్ భులయ్యా 3’ మూవీ కూడా హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా 400 కోట్లకి పైగా కలెక్షన్స్ ని అందుకుంది. మొత్తానికి బాలీవుడ్ మేకర్స్ అయితే ట్రెండ్ ని బాగా ఒంటబట్టించుకున్నారనే మాట వినిపిస్తోంది.

ప్రస్తుతం ఆడియన్స్ మైథాలజీ కనెక్షన్స్ తో నడిచే ఫిక్షనల్ స్టోరీస్, హర్రర్, థ్రిల్లర్ మూవీస్ ని ఏక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ ఏడాది హిట్ అయిన సినిమాలలో చాలా వరకు ఈ జోనర్ లో ఉన్నవే కావడం విశేషం. మూలాలని నమ్ముకొని తెరకెక్కించే కథల ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. మ్యాడ్ డాక్ ఫిలిమ్స్ తరహాలో ఇంకా వేరే ప్రొడక్షన్ లు కూడా ఇలాంటి హర్రర్, థ్రిల్లర్ కథలని ఆడియన్స్ ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారా అనేది వేచి చూడాలి.

మ్యాడ్‌డాక్ ఫిలిమ్స్ 2025-2028 విడుదలల తేదీల లిస్ట్:

2025:

1. థామా - దీపావళి

2. శక్తి షాలిని - డిసెంబర్ 31

2026:

1. భేడియా 2 - ఆగస్ట్ 14

2. చాముండ - డిసెంబర్ 4

2027:

1. స్త్రీ 3 - ఆగస్ట్ 13

2. మహా ముంజ్య - డిసెంబర్ 24

2028:

1. పెహ్లా మహాయుద్ధ్ 1 - ఆగస్ట్ 11

2. దూసర మహాయుద్ధ్ 2 - అక్టోబర్ 18

Tags:    

Similar News