సారీ చెప్పాలని డిమాండ్.. తేజ నిజంగానే హర్ట్ చేశాడా?
ఆ సమయంలో వారిద్దరి మధ్య జరిగిన సరదా సంభాషణ.. ఇప్పుడు చిత్ర పరిశ్రమ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
సినీ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఐఫా అవార్డుల ప్రదానోత్సవ వేడుక రీసెంట్ గా దుబాయ్ లో జరిగిన విషయం తెలిసిందే. ఎప్పుడూ ఐఫా వేడుకలకు బాలీవుడ్ స్టార్స్ మాత్రమే హోస్టులుగా వ్యవహరిస్తారు. కానీ ఈసారి టాలీవుడ్ హీరోస్ రానా దగ్గుబాటి, తేజ సజ్జా కూడా హోస్ట్ చేశారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య జరిగిన సరదా సంభాషణ.. ఇప్పుడు చిత్ర పరిశ్రమ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఐఫా అవార్డ్స్ సెర్మనీలో తేజ సజ్జ గురించి రానా ఇంట్రడక్షన్ ఇచ్చారు. "ఇంకా ఇప్పటికీ అలాగే ఉన్నాడు. కాంట్రవర్సీలకు దూరంగా.. వెరీ సాఫ్ట్ స్పోకెన్.. మిలియన్ల మందికి హార్ట్ త్రోబ్.. ది లవర్ బాయ్.. ది యాక్షన్ స్టార్.. ది వన్ అండ్ ఓన్లీ.." అంటూ కంటిన్యూ చేస్తుంటారు. ఇంతలో తేజ.. ఇంత బిల్డప్ అవసరమా అని అంటారు. దీంతో తాను మహేష్ బాబు గురించి చెప్పానని రానా అనడంతో నాకు సింక్ అయిందేంటి అని తేజ అంటారు.
అప్పుడు రానా.. "అవును కరెక్టే.. ఇద్దరూ చైల్డ్ ఆర్టిస్ట్సే.. అతనేమో సూపర్ స్టార్.. నువ్వేమో సూపర్ హీరో.. ఇద్దరూ సంక్రాంతికే వచ్చారు" అని అనగా.. ఆ సంక్రాంతి టాపిక్ మాట్లాడకని తేజ అంటారు. దీంతో అంత సెన్సిబుల్ టాపికా అని రానా అడుగుతారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో మహేష్ ఫ్యాన్స్ స్పందిస్తున్నారు. తేజ సజ్జా సారీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. చులకనగా మాట్లాడారంటూ ఆరోపిస్తున్నారు.
అదే సమయంలో కొందరు నెటిజన్లు.. తేజ సజ్జా తప్పుగా ఏం మాట్లాడలేదని చెబుతున్నారు. రానా సంక్రాంతి పోటీ కోసం ప్రస్తావించినా.. గౌరవంగా తేజ ఆ టాపిక్ ను ముగించినట్లు కామెంట్లు పెడుతున్నారు. కామెడీ మాత్రమే చేశారని, ఎవరినీ కించపరచలేదని అంటున్నారు. చులకనగా ఏం మాట్లాడలేదని అభిప్రాయపడుతున్నారు. ఫుల్ వీడియో చూడకుండా చిన్న బిట్స్ తో ఎవరినీ ఎప్పుడూ ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని చెబుతున్నారు.
అయితే ఈ ఏడాది సంక్రాంతికి మహేష్ బాబు గుంటూరు కారం, నాగార్జున నా సామిరంగా, వెంకటేష్ సైంధవ్ తో పాటు ప్రశాంత్ వర్మ- తేజ సజ్జా హనుమాన్ సినిమాలు బరిలో దిగిన విషయం తెలిసిందే. ఎవరూ ఊహించని విధంగా చిన్న చిత్రంగా విడుదలైన హనుమాన్.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. గుంటూరు కారం మూవీ కూడా టాక్ తో సంబంధం లేకుండా భారీ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది.