అర్భాజ్ పెళ్లి తర్వాత మలైకా రహస్య పోస్ట్
తాజాగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కృతజ్ఞతతో ఉండటం గురించి ఒక రహస్య పోస్ట్‌ను మలైకా షేర్ చేసారు.
అర్బాజ్ తో మలైకా అరోరా బ్రేకప్ అటుపై అర్జున్ కపూర్ తో డేటింగ్ వగైరా విషయాలు తెలిసినవే. ఇంతలోనే ఆర్భాజ్ మేకప్ ఆర్టిస్ట్ షురాను పెళ్లాడాడు. ఈ పెళ్లికి మలైకా హాజరు కాని సంగతి తెలిసిందే. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కృతజ్ఞతతో ఉండటం గురించి ఒక రహస్య పోస్ట్‌ను మలైకా షేర్ చేసారు. మలైకా తన మాజీ భర్త అర్బాజ్ ఖాన్ సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ షురా ఖాన్‌ను పెళ్లాడిన కొన్ని రోజుల తర్వాత ఈ పోస్ట్ వైరల్ గా మారింది. డిసెంబరు 24 ఆదివారం నాడు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ప్రయివేట్ వేడుకలో అర్బాజ్ - షురా వివాహం చేసుకున్నారు. 4amthoughts.official అనే ఇన్ స్టా హ్యాండిల్ లో తన సందేశాన్ని మళ్లీ పోస్ట్ చేస్తూ మలైకా ఇలా వ్యాఖ్యానించారు. ``నేను మేల్కొన్నాను. నాకు వేసుకోవడానికి బట్టలు ఉన్నాయి. నా దగ్గర రన్నింగ్ వాటర్ ఉంది. నాకు తినడానికి తిండి ఉంది. నేను కృతజ్ఞురాలిని``అని రాసారు.
మలైకా అరోరా - అర్బాజ్ ఖాన్ 1998లో వివాహం చేసుకున్నారు. 18ఏళ్ల కాపురం తర్వాత విడాకుల ప్రకటన అందరికీ షాకిచ్చింది. మార్చి 2016లో ఈ ప్రకటన వచ్చింది. ఈ జంట అధికారికంగా మే 2017లో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం వారి కుమారుడు అర్హాన్ ఖాన్ కి సహ-తల్లిదండ్రులుగా కొనసాగుతున్నారు. అర్బాజ్ తండ్రి సలీం ఖాన్ ఈ పెళ్లి గురించి మాట్లాడారు. తన కొడుకు విషయంలో సంతోషంగా ఉన్నానని చెప్పాడు. వారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అది నేరంగా భావించడం లేదు. నేను అతడి విషయంలో సంతోషిస్తున్నాను. వధూవరులకు నా ఆశీస్సులు అందించాను``అని సలీమ్ చెప్పాడు.
అర్బాజ్ మలైకా నుంచి విడిపోయాక విదేశీ బ్యూటీ జార్జియానీతో డేటింగ్ చేసాడు. మలైకా కూడా నటుడు అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేస్తోంది. అర్జున్ ఇటీవల కాఫీ విత్ కరణ్ సీజన్ 8లో మలైకా అరోరాతో తన సంబంధం గురించి స్పష్టంగా చెప్పాడు. హోస్ట్ కరణ్ జోహార్ అర్జున్‌ని ఈ సంబంధాన్ని ఎప్పుడైనా తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అని ప్రశ్నించాడు. అయితే ఆమె(మలైకా) లేకుండా ఇక్కడ కూర్చుని భవిష్యత్తు గురించి మాట్లాడటం అన్యాయమని నేను భావిస్తున్నాను అంటూ అర్జున్ కట్ చేసాడు.