పీకాక్ పై పరిమళించిన యువ రాణి!
తాజాగా ప్రఖ్యాత పీకాక్ మ్యాగజైన్ కవర్ పై అమ్మడి మెరుపులతో ఫిదా చేస్తుంది. వైట్ కలర్ లెహంగా దుస్తుల్లో యువరాణిలో ముస్తాబైన విధానం మంత్రముగ్దుల్ని చేస్తుంది.
మాజీ మిస్ వరల్డ్..మిస్ ఇండియా మానుషీ చిల్లర్ ఫ్యాషన్ ఎంపికల్లో తానో బ్రాండ్ బ్యూటీ. ఎప్పటికప్పుడు తనదైన మార్క్ అప్పిరియన్స్ తో అలరించడం అమ్మడి ప్రత్యేకత. మోడలింగ్ లో ఆరితేరిన బ్యూటీ కావడంతో నలుగురిలో మరింత స్పెషల్ గా ఫోకస్ అవుతుంటుంది. తాజాగా ప్రఖ్యాత పీకాక్ మ్యాగజైన్ కవర్ పై అమ్మడి మెరుపులతో ఫిదా చేస్తుంది. వైట్ కలర్ లెహంగా దుస్తుల్లో యువరాణిలో ముస్తాబైన విధానం మంత్రముగ్దుల్ని చేస్తుంది.
మానుషీ అందాన్ని ఎంబ్రాయిడరీ డిజైన్ మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది. మెడలో డైమండ్ జ్యూలరీ..నుదిటిన డిజైనర్ పాపిడి బొట్టు తో మరింత ప్రకాశవంతంగా మెరిసిపోతుంది. మరో పిక్ లో గులాబీ రంగులో పరిమళించడం అంతకు మించి వావ్ అనిపిస్తుంది. డ్రెస్ డిజైన్ ని మ్యాచ్ చేస్తూ ఎంపిక చేసుకున్న యాక్సరసీస్ ప్రతీది అమ్మడిని సంథింగ్ స్పెషల్ గా ఫోకస్ చేస్తుంది. అద్భుతమైన ఉపకరణాల తో మానుషీ అందం రెట్టింపు అయింది.
నెక్లెస్‌లు, మిరుమిట్లు గొలిపే చెవిపోగులు, బ్యాంగిల్స్.. ప్రతీది ఎంతో అదంగా ప్రోజెక్ట్ చేస్తున్నాయి. మ్యాకప్ మరింత షైనింగ్ ని తీసుకొచ్చింది. డార్క్ పింక్ ఐలైనర్‌తో జత చేసిన బోల్డ్, డార్క్ రెడ్ లిప్‌స్టిక్ నేచురల్ బ్యూటీని హైలైట్ చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మానుషీ అభిమానులు తనివి తీరా అందాన్ని చూసి ఆస్వాదిస్తున్నారు.
ఇక మానుషీ కెరీర్ సంగతి చూస్తే! ఏ ముహూర్తాన లాంచ్ అయిందో గానీ అననీ పరాజయాలే ఎదురవుతున్నాయి. డెబ్యూ 'సామ్రాట్ పృధ్వీరాజ్' ఆశించిన ఫలితా న్నివ్వలేదు. అటుపై నటించిన 'గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ' కూడా నిరాశనమే మిగిల్చింది. టాలీవుడ్ వెంచర్ 'ఆపరేషన్ వాలెంటైన్' అదే వరుసలో నిలిచింది. ఇటీవల విడుదలైన 'బడే మియాన్ చోటే మియాన్' డిజాస్టర్ నే నమోదు చేసింది. ప్రస్తుతం ఆమె పైప్‌లైన్‌లో ఒకే ఒక చిత్రం ఉంది. జాన్ అబ్రహంతో ' టెహ్రాన్' అనే సినిమాలో నటిస్తోంది. ఈసినిమాతో హిట్ అందుకోవాల్సిన అవసరం ఏర్పడింది.