ఈవిడ కూడా స‌ర్జ‌న్ కాబోయి మ్యాక‌ప్ వేసుకుందే!

తాజాగా 'ఆప‌రేష‌న్ వాలెంటైన్' తో హీరోయిన్ గా ప‌రిచ‌య‌మ‌వుతోన్న మానుషీ చిల్లర్ కూడా అంతే. కాక‌పోతే ఈ అమ్మ‌డు ఎంబీబీఎస్ పూర్తిచేసిన త‌ర్వాత కార్డియాక్ స‌ర్జ‌రీ పూర్తి చేయాల‌నుకుంది.

Update: 2024-02-20 07:14 GMT

డాక్ట‌ర్ కాబోయ్ యాక్ట‌ర్లు అయ్యాం అన్న‌ది పాత మాట‌..డాక్ట‌ర్లు అయ్యాం..యాక్ట‌ర్లు అయ్యాం అన్న‌ది కొత్త మాట‌. అవును ఒక్క‌ప్పుడు డాక్ట‌ర్ చ‌దువుకోసం వ‌చ్చి ఇంట్లో తల్లిదండ్రుల‌కు చెప్ప‌కుండా సినిమాల్లోకి స‌క్సెస్ అయిన త‌ర్వాత చెప్పేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. సినిమాలే జీవితంగా భావించ‌కుండా త‌ల్లిదండ్రుల కోరిక మేర‌కు చ‌ద‌వాల్సిన చ‌దువుల‌న్నీ చ‌దివేసి సినిమాలవైపు వ‌స్తున్నారు.

 

దీనిలో భాగంగానే చాలా మంది హీరోయిన్లు ఎంబీబీఎస్ లు పూర్తిచేసిన త‌ర్వాత సినిమాల్లోకి వ‌స్తున్నారు. అదే స‌మ‌యంలో మోడ‌లింగ్ లోనూ కొంత అనుభ‌వం సంపాదిస్తున్నారు. శ్రీలీల ఎంబీబీఎస్ చేస్తూనే సినిమా ప్ర‌య‌త్నాలు చేసి స‌క్సెస్ అయింది. సినిమాల కోస‌మ‌నే డాక్ట‌ర్ చ‌దువు వ‌ద‌ల్లేదు. సెట్స్ లో కూర్చునే డాక్ట‌ర్ పుస్త‌కాలు చ‌దివేసేది. 'భ‌గ‌వంత కేస‌రి' షూటింగ్ అంతా అలాగే పూర్తి చేసింది శ్రీలీల‌.

తాజాగా 'ఆప‌రేష‌న్ వాలెంటైన్' తో హీరోయిన్ గా ప‌రిచ‌య‌మ‌వుతోన్న మానుషీ చిల్లర్ కూడా అంతే. కాక‌పోతే ఈ అమ్మ‌డు ఎంబీబీఎస్ పూర్తిచేసిన త‌ర్వాత కార్డియాక్ స‌ర్జ‌రీ పూర్తి చేయాల‌నుకుంది. కానీ ఇంత‌లోనే మోడ‌లిండ్ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఆ ర‌కంగా స‌ర్జ‌రీ కోర్స్ పూర్తి చేయ‌లేక‌పోయింది. అమ్మ‌డు స్వ‌స్థ‌లం హ‌రియానా. కుటుంబ‌మంతా డాక్ట‌ర్లే..అమ్మ నాన్న‌లు పేరున్న వైద్యులు.

వాళ్ల బంధువులంతా కూడా డాక్ట‌ర్ వృత్తిలోనే కొనసాగుతున్నారుట‌. దీంతో తాను కూడా క‌ష్ట‌ప‌డి మెడిక‌ల్ సీట్ తెచ్చుకుందిట‌. మిస్ వ‌ర‌ల్డ్ పోటీల‌కు వెళ్ల‌డం అన్న‌ది యాదృశ్చికంగా జ‌రిగిందిట‌. అందుకు కార‌ణంగా వాళ్ల అమ్మ అంటుంది. ఐశ్వ‌ర్య‌రాయ్ అంటే వాళ్ల‌మ్మ‌కు ఎంతో ఇష్ట‌మ‌ట‌. ఐశ్వ‌ర్యా రాయ్ గురించి స‌మ‌యం దొర‌కిన‌ప్పుడ‌ల్లా చెబుతూనే ఉంటుందిట‌. అలా ఐశ్వ‌ర్యారాయ్ కార‌ణంగానూ సినిమాల‌పై త‌న‌కు ఆసక్తి పెరిగింద‌ని చెప్పుకొచ్చింది.

Tags:    

Similar News