ఆ దర్శకుడిపై మెగా భారం

అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Update: 2023-08-12 12:41 GMT

మెగాస్టార్ చిరంజీవి తాజాగా భోళా శంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. వేదాళం రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంతో మెహర్ రమేష్ మళ్ళీదశాబ్దకాలం తర్వాత మెగా ఫోన్ పట్టారు. అయితే ఈ సినిమా దర్శకత్వం చేసే అవకాశం మెహర్ రమేష్ కి రావడానికి కారణం మెగాస్టార్ చిరంజీవి అని చెప్పాలి. చిరంజీవితో ఉన్న బంధుత్వమే అతనితో భోళా శంకర్ సినిమా చేయడానికి కారణం అయ్యింది.

కొత్త కథ అయితే వర్క్ అవుట్ అవ్వదేమో అని తమిళంలో హిట్ అయిన సినిమాని తీసుకొని మెహర్ రమేష్ చేతిలో చిరంజీవి పెట్టారు. అనిల్ సుంకరకి సినిమా చేయడానికి గతంలో కమిట్మెంట్ ఇవ్వడంతో భోళా శంకర్ కి నిర్మాతగా అతనిని సెట్ చేశారు. అతను కూడా ఖర్చుకి వెనుకాడకుండా భోళా శంకర్ ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఏజెంట్ లాంటి డిజాస్టర్ తర్వాత మెగాస్టార్ మూవీ తనని సేవ్ చేస్తుందని అనిల్ సుంకర కూడా చాలా హోప్స్ పెట్టుకున్నారు.

అయితే థియేటర్స్ లోకి వచ్చిన ఈ మూవీ కనీసం మెగా ఫ్యాన్స్ కి కూడా నచ్చలేదు. రొటీన్ ఫార్మాట్ లో సాగే కథ, కథనం, ఇప్పటికే చాలా సినిమాలలో వాడేసిన డైలాగ్స్, మేకింగ్ పరంగా కూడా భోళా శంకర్ పై నెగిటివ్ రివ్యూలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో అయితే విపరీతమైన ట్రోల్స్, రోస్టింగ్ వీడియోలు భోళా శంకర్ మూవీపైన ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. వాల్తేర్ వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వెంటనే భోళా శంకర్ తో మెగాస్టార్ డిజప్పాయింట్ చేశారు.

అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రసన్న కుమార్ ఈ మూవీ కథ అందిస్తున్నారు. కొనెదల సుస్మిత చిత్రాన్ని నిర్మించనుంది. భోళా శంకర్ డిజాస్టర్ కావడంతో ఇప్పుడు కళ్యాణ్ కృష్ణపై మరింత ఒత్తిడి పెరిగిందని చెప్పొచ్చు. కచ్చితంగా నెక్స్ట్ మూవీ బ్లాక్ బస్టర్ ఇవ్వాల్సిందే. ఇప్పటి వరకు ఈ దర్శకుడు చేసిన నాలుగు సినిమాలలో సోగ్గాడే చిన్ని నాయనా మూవీ మాత్రమే సూపర్ హిట్ అయ్యింది.

రవితేజతో చేసిన నేల టికెట్ డిజాస్టర్ అయ్యింది. నాగ చైతన్యతో రారండోయ్ వేడుకచూద్దాం మోస్తరు హిట్ గా ఉంది. సోగ్గాడే చిన్ని నాయనా సీక్వెల్ గా చేసిన బంగార్రాజు ఒకే ఒకే అనిపించుకుంది. ఈ నాలుగు సినిమాలలో ఏ స్టోరీ కూడా కొత్త కాన్సెప్ట్ అని చెప్పుకోవడానికి లేదు. రొటీన్ ఫార్ములా కథలతోనే చేశారు. మెగాస్టార్ లాంటి చరిష్మా ఉన్న స్టార్ నుంచి మెగా ఫ్యాన్స్ కూడా కమర్షియల్ యాంగిల్ ఉన్న కథనంలో అయిన కొత్తదనం ఉండాలని కోరుకుంటున్నారు. అది కూడా లేకపోతే నిర్ధాక్షిణ్యంగా డిజాస్టర్ చేస్తున్నారు. ఆచార్య, భోళా శంకర్ రిజల్ట్స్ చూసిన తర్వాత మెగాస్టార్ ఇమేజ్, ఫ్యాన్స్ ఎక్స్ పెక్టేషన్స్ దృష్టిలో ఉంచుకొని మూవీ చేయాలి. మరి ఈ ఒత్తిడిని కళ్యాణ్ కృష్ణ ఎంత వరకు అధికమిస్తాడో చూడాలి.

Tags:    

Similar News