దేవర - గుంటూరు కారం.. ఆ ప్రభావం వల్లే రిజల్ట్ లో తేడా..

Update: 2024-10-12 13:30 GMT

ఈ ఏడాది రిలీజ్ అయిన పెద్ద సినిమాలలో ‘గుంటూరు కారం’ ఒకటి. ఈ సినిమాకు మిడ్ నైట్ షోలు పడిన విషయం తెలిసిందే. అయితే ‘కల్కి 2898ఏడీ’ సినిమాకి ఎర్లీ మార్నింగ్ షోలు వేశారు. అర్ధరాత్రి స్పెషల్ ప్రీమియర్ షోలు తెలుగు రాష్ట్రాలలో ప్రదర్శించలేదు. మరల ఎన్టీఆర్ ‘దేవర’ మూవీకి అర్ధరాత్రి స్పెషల్ షోలని వేశారు. ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చుకొని అర్ధరాత్రి షోలు ప్రదర్శించారు. ఈ షోలకి ఫ్యాన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ ప్రభావం మూవీ కలెక్షన్స్ లో కూడా స్పష్టంగా కనిపించింది.

మొదటి రోజు ‘దేవర’ మూవీ 154 కోట్లకి పైగా కలెక్షన్స్ వసూళ్లు చేసింది. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ పై నాగవంశీ తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేశారు. ఈ మూవీకి లాభాలు వచ్చాయని తాజాగా నాగవంశీ ప్రెస్ మీట్ లో క్లారిటీ ఇచ్చారు. ప్రేక్షకుల కోరిక మేరకు కలెక్షన్స్ పోస్టర్స్ ని రిలీజ్ చేస్తున్నట్లు కూడా నాగవంశీ చెప్పారు. సితార ఎంటర్టైన్మెంట్స్ లో తెరకెక్కిన ‘లక్కీ భాస్కర్’ మూవీ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా నాగవంశీ ‘దేవర’ కలెక్షన్స్ పై క్లారిటీ ఇచ్చాడు.

మిడ్ నైట్ షోల వలన ‘దేవర’ కి మంచి లాభాలు వచ్చాయి. ఈ సినిమా మిడ్ నైట్ షోలు వేయడం ద్వారా నాకో విషయం అర్ధమైంది. అర్ధరాత్రి షోలకి వచ్చిన టాక్ ఎలా ఉన్న కూడా సినిమాలో విషయం ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారు. మంచి సక్సెస్ ని ఇస్తారని నాగవంశీ చెప్పుకొచ్చారు. ‘లక్కీ భాస్కర్’ సినిమాకి మిడ్ నైట్ షోలు వేయడం లేదని స్పష్టం చేశాడు. అయితే రిలీజ్ కి ముందు రోజు ప్రీమియర్స్ ఉంటాయని తెలిపాడు.

ఈ మూవీ అక్టోబర్ 31న థియేటర్స్ లోకి వస్తోంది. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా ఐదు భాషలలో రిలీజ్ అవుతోంది. అంటే అక్టోబర్ 30న ప్రీమియర్స్ వేయనున్నట్లు నాగవంశీ మాటల బట్టి అర్ధమవుతోంది. ఇదిలా ఉంటే గుంటూరు కారం సినిమా అర్ధరాత్రి షోల వలన నెగిటివ్ టాక్ జనాల్లోకి వెళ్లిందని నాగవంశీ గతంలో మాట్లాడారు. అయితే ‘దేవర’ విషయంలో మాత్రం ఆ మిడ్ నైట్ షోలు సినిమాకి ప్లస్ అయ్యాయని ఇప్పుడు చెప్పుకొచ్చారు.

‘దేవర’ మూవీకి మిశ్రమ రివ్యూలు వచ్చిన కూడా అద్భుతమైన ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా 500 కోట్ల కలెక్షన్స్ దిశగా దూసుకుపోతోంది. ‘దేవర’ మూవీతో లాభాలు రావడంతో నాగవంశీ లక్కీ భాస్కర్ సినిమా విషయంలో ఫుల్ కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News