జవాన్ తో శెట్టి పొలిశెట్టి రావడం కరెక్టేనా?
నేడు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన జవాన్, అనుష్క మరియు నవీన్ పొలిశెట్టి నటించిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
నేడు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన జవాన్, అనుష్క మరియు నవీన్ పొలిశెట్టి నటించిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. జవాన్ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాల నడుమ విడుదల అయింది. ఇక శెట్టి పొలిశెట్టి సినిమా తెలుగు రాష్ట్రాల్లో మంచి బజ్ ను క్రియేట్ చేయడం లో సక్సెస్ అయింది.
గత వారం ఖుషి సినిమా విడుదల అయిన నేపథ్యం లో ఈ వారం సినిమాలపై ప్రేక్షకుల్లో అమితాశక్తి నెలకొంది. అయితే జవాన్ మరియు మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా లు ఒకే రోజు రావడం తో ఇతర ప్రాంతాలతో పోల్చితే తెలుగు బాక్సాఫీస్ వద్ద ప్రభావం ఉంటుందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. నిన్న మొన్నటి వరకు విడుదల విషయంలో కొందరు కామెంట్స్ చేస్తూ వచ్చారు.
ఎవరేమి అనుకున్నా.. ఎన్ని అన్నా కూడా రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్దకు వచ్చేశాయి. రెండు సినిమాలకు కూడా ఆయా హీరోల, హీరోయిన్స్ అభిమానులు థియేటర్ల ముందు క్యూ కట్టారు. జవాన్ సినిమా కు దేశవ్యాప్తంగా కాకుండా విదేశాలలో కూడా భారీ ఎత్తున అడ్వాన్స్ బుకింగ్ నమోదు అయింది. ఇక మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా విషయంలో కూడా అదే జరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో జవాన్ కి మంచి ఓపెనింగ్ దక్కింది. మరో వైపు అనుష్క సినిమాకు కూడా భారీ ఓపెనింగ్స్ నమోదు అయ్యే విధంగా అడ్వాన్సింగ్ బుకింగ్ నమోదు అయింది. ఈ రెండు సినిమాలు ఒకే రోజు రావడం కరెక్ట్ కాదు అంటూ వ్యాఖ్యలు చేసిన వారికి ఓపెనింగ్ విషయం లో ఎలాంటి ఇబ్బంది లేకుండా రెండు సినిమాలు కూడా మంచి వసూళ్లు రాబడుతున్నాయి. ఇక లాంక్ రన్ లో ఏ సినిమా పై చేయి సాధిస్తుందో చూడాలి.