పిక్‌ టాక్ : చీర కట్టి అందంగా మృణాల్‌

మృణాల్‌ ఠాకూర్‌ తాజాగా క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఫోటోలకు ఫోజ్ ఇచ్చింది. విభిన్నమైన ఔట్‌ ఫిట్‌ తో రకరకాల మేకోవర్‌తో ఫోటోలు దిగిన మృణాల్ వాటిని సోషల్ మీడియా ద్వారా షేర్‌ చేసింది.;

Update: 2025-03-12 02:45 GMT

తెలుగు ప్రేక్షకులకు సీతారామం సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ మృణాల్‌ ఠాకూర్‌ ఆ వెంటనే హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్‌ సినిమాల్లో నటించింది. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఫ్యామిలీ స్టార్‌ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. అయినా మృణాల్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. తెలుగులో అడవి శేష్‌తో కలిసి డెకాయిట్‌ సినిమాలో నటిస్తోంది. ఆ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమాతో పాటు హిందీలోనూ ఈ అమ్మడు రెండు మూడు సినిమాలు చేస్తుంది. సౌత్‌లో ఈ అమ్మడికి మంచి డిమాండ్ ఉంది. కానీ బాలీవుడ్‌ సినిమాల్లో నటించాలనే ఆసక్తిని కనబర్చుతోంది.

 

హీరోయిన్‌గా ఎంట్రీకి ఇవ్వడానికి ముందు హిందీలో సీరియల్స్‌లో ఈమె నటించింది. సుదీర్ఘ కాలం పాటు బుల్లి తెరపై, అటు నుంచి వెండి తెరపై ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్‌ చాలా కాలం పాటు హిట్‌ కోసం కష్టపడింది. బాలీవుడ్‌లో సరైన బ్రేక్ దక్కలేదు. కానీ తెలుగులో చేసిన సీతారామం సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం ద్వారా బాలీవుడ్‌లోనూ ఈ అమ్మడికి మంచి గుర్తింపు లభించి అక్కడ ప్రస్తుతం మూడు నాలుగు సినిమాల్లో నటిస్తున్న విషయం తెల్సిందే. బాలీవుడ్‌లో ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్‌లను చేస్తున్న ఈమె సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌గా అందమైన ఫోటోలను షేర్‌ చేస్తూ తన ఫాలోవర్స్‌కి కన్నుల విందు చేస్తుంది.

 

మృణాల్‌ ఠాకూర్‌ తాజాగా క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఫోటోలకు ఫోజ్ ఇచ్చింది. విభిన్నమైన ఔట్‌ ఫిట్‌ తో రకరకాల మేకోవర్‌తో ఫోటోలు దిగిన మృణాల్ వాటిని సోషల్ మీడియా ద్వారా షేర్‌ చేసింది. ప్రతి ఫోటోలోనూ క్యూట్‌గా, చూపు తిప్పనివ్వకుండా అందంగా మృణాల్‌ ఠాకూర్ ఉంది. ఇంతటి అందం మృణాల్‌ కి మాత్రమే సాధ్యం అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. నెట్టింట ఈ అమ్మడు షేర్ చేస్తున్న ఫోటోలు ఎప్పటికప్పుడు వైరల్‌ అవుతూ ఉంటాయి. మరోసారి మృణాల్‌ ఠాకూర్‌ అందమైన ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

చీర కట్టులో చాలా అందంగా ఉన్న మృణాల్‌ ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. టాలీవుడ్‌లో మృణాల్‌ ఓకే చెప్పాలే కానీ వరుసగా ఆఫర్లు వస్తాయి. కానీ బాలీవుడ్‌లో మాత్రమే ఈమె ఎక్కువ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంది. బాలీవుడ్‌లో ఈమె పూజా మేరీ జాన్, హై జవానీ తో ఇష్క్ హోనా హై, సన్నాఫ్ సర్దార్‌ 2, తుమ్ హో తో సినిమాల్లో నటిస్తుంది. ఆ సినిమాలకు సంబంధించిన షూటింగ్‌ వివిధ దశల్లో ఉన్నాయి. ఈ ఏడాదిలో రెండు మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

Tags:    

Similar News