'యానిమల్' నటుడే 'బర్ఫీ'లో చేసాడని మరువొద్దు: మృణాల్
ఒక కళాకారిణి కొన్ని సార్లు `సంతకం చేయడం` కంటే `సరైన ఆఫర్` కోసం వేచి ఉండటమే సరైనది అని మృణాల్ ఠాకూర్ అన్నారు.
ఒక కళాకారిణి కొన్ని సార్లు `సంతకం చేయడం` కంటే `సరైన ఆఫర్` కోసం వేచి ఉండటమే సరైనది అని మృణాల్ ఠాకూర్ అన్నారు. తక్కువ స్క్రీన్ సమయం ఉన్న సినిమాలో పని చేసినా ప్రభావవంతమైన పాత్ర అయితే నటిస్తానని అన్నారు. లవ్ సోనియా, సూపర్ 30, సీతా రామం, హాయ్ నాన్నా చిత్రాలతో విజయాలు అందుకున్న మృణాల్ వరుస చిత్రాలతో కెరీర్ పరంగా బిజీగా ఉంది. తనకు ప్రకంపనలు సృష్టించే పాత్రలు చేయాలనుందని కూడా మృణాల్ అంది. నా కోసం గొప్ప స్క్రిప్ట్‌లు ఉంటే దయచేసి నన్ను సంప్రదించండి! అని ఫిలింమేకర్స్ ని కోరింది. IIFA ఉత్సవం 2024 గ్రీన్ కార్పెట్‌పై పిటిఐతో మాట్లాడుతూ మృణాల్ పైవిధంగా స్పందించారు.
ఎంపికల్లో సినిమా కంటెంట్, దానిలో తన పాత్ర ఏమిటనే దానిపై శ్రద్ధ వహిస్తానని మృణాల్ ఠాకూర్ చెప్పారు. ఏదైనా సినిమాలో నా పార్ట్ సీన్లు తీసేస్తే ఆశించిన పేరు రాదు. కొన్ని సినిమాల్లో అరుదుగా ఒక్క సీన్ అయినా ఆ సినిమాలో భాగమవ్వాలనిపిస్తుంది..అవి గొప్ప పాత్రలు (మహిళలకు) అవ్వాలి.. అని అంది. అయితే అవకాశాల కోసం వేచి ఉండాల్సిన అవసరం ఉంది. నేను ప్రయోగాత్మక సినిమాలకు సైన్ చేయాలనుకుంటున్నాను.. నేను గొప్ప పని చేయాలనుకుంటున్నాను. నేను అద్భుతమైన ఫిలింమేకర్స్ కోసం వెతుకుతున్నాను. కొత్త దర్శకులతో పని చేయాలనుకుంటున్నాను అని తెలిపింది. హాయ్ నాన్న దర్శకుడు శౌర్యువ్ తో మరోసారి కలిసి పని చేయాలనుకుంటున్నట్టు తెలిపింది. శౌర్యువ్ తొలి చిత్ర దర్శకుడే అయినా అది ఎవరూ నమ్మలేదని మృణాల్ వ్యాఖ్యానించింది.
యానిమల్‌లో రణబీర్‌కి మద్ధతు:
సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన 2023 చిత్రం `యానిమల్`లో దూకుడు ఉన్న, క్రూరమైన యువకుడి పాత్రను పోషించిన రణబీర్ కపూర్‌ను చాలా మంది విమర్శించగా, దాంతో సంబంధం లేకుండా ఇప్పుడు మృణాల్ ఠాకూర్ సమర్థించారు. అబుదాబిలో మీడియాతో మాట్లాడిన మృణాల్ ఠాకూర్.. 2012 చిత్రంలో కూడా అదే రణబీర్ బర్ఫీ పాత్రను పోషించాడని అందరికీ గుర్తు చేసారు. మృణాల్ మాట్లాడుతూ, ``బర్ఫీలో నటించిన నటుడు కూడా రణబీర్ అని మర్చిపోవద్దు. అతడి సినిమాల్లోని వైవిధ్యం చూడాలి. బర్ఫీ అయినా యానిమల్ అయినా రెండింటినీ తెలివిగా ఆడేస్తాడని మనం ఎందుకు అనుకోకూడదు?`` అని ప్రశ్నించింది. బర్ఫీ - అనురాగ్ బసు దర్శకత్వం వహించిన రొమాంటిక్ కామెడీ చిత్రం. ఈ చిత్రంలో రణబీర్, ప్రియాంక చోప్రా మరియు ఇలియానా తదితరులు నటించారు.
మృణాల్ ఠాకూర్ తదుపరి చిత్రం `పూజా మేరీ జాన్`లో కనిపించనుంది. ఇది పవర్‌ఫుల్ డ్రామా. ఈ చిత్రంలో సనాగా హుమా ఖురేషి ... పూజ పాత్రలో మృణాల్ ఠాకూర్ నటించారు.`పూజా మేరీ జాన్` అక్షరాలా నా జాన్. ఈ దేశంలోని ప్రతి అమ్మాయి నేను పోషించిన పాత్రలో తనని తాను చూసుకుంటుందని భావిస్తున్నాను అని ఆమె చెప్పింది. ఈ చిత్రానికి నవజ్యోత్ గులాటి దర్శకత్వం వహించారు. విపాషా అరవింద్ సహ-దర్శకత్వం వహించారు . దినేష్ విజన్ మడాక్ ఫిల్మ్స్ - అమర్ కౌశిక్ సమర్పించారు.