ఆ విష‌యంలో ట్రోలింగ్‌ని త‌ట్టుకోలేక‌పోయాన‌న్న‌ న‌టి

త‌మ‌కు ఎదురైన‌ బాడీ షేమింగ్ గురించి ప‌లువురు అగ్ర క‌థానాయిక‌లు బ‌హిరంగంగా మాట్లాడారు.

Update: 2024-04-27 05:07 GMT

త‌మ‌కు ఎదురైన‌ బాడీ షేమింగ్ గురించి ప‌లువురు అగ్ర క‌థానాయిక‌లు బ‌హిరంగంగా మాట్లాడారు. ఇంత‌కుముందు స‌మీరా రెడ్డి, ప్రియాంక చోప్రా, లారా ద‌త్తా, సుహానా ఖాన్, భూమి ఫెడ్నేక‌ర్ లాంటి నాయిక‌లు త‌మ‌కు బాడీ షేమింగ్ అనుభ‌వాలు ఎదుర‌య్యాయ‌ని అన్నారు. అందం ఆక‌ర్ష‌ణ బొద్దుత‌నం గురించి బ‌హిరంగంగా విమ‌ర్శలు ఎదుర‌య్యాయ‌ని, సోష‌ల్ మీడియాల్లో ట్రోలింగ్ ఎదురైంద‌ని అంగీక‌రించారు.


ఇలాంటి అనుభ‌వం త‌న‌కు కూడా ఎదురైంద‌ని ఇప్పుడు ప్ర‌తిభావంతురాలైన నేటిత‌రం న‌టి మృణాల్ ఠాకూర్ అన్నారు. బాడీ షేమింగ్, సోషల్ మీడియా తాలూకా మోసపూరిత ఆకర్షణ.. నిరంతరం అభివృద్ధి చెందుతున్న అందం ప్రమాణాల ఒత్తిళ్ల గురించి మాట్లాడారు.

త‌న అందం విష‌యంలో ఎదురైన ట్రోలింగ్ ని త‌ట్టుకోలేక‌పోయాన‌ని, ఒక్కోసారి నేను మేల్కొనడానికి ఇష్టపడని రోజులు ఉన్నాయని మృణాల్ అన్నారు. నేను నా మంచం నుండి లేవాలని అనుకోలేదు.. కానీ నేను ఇతరుల కోసం కాదు.. నా కోసం నిదుర లేచాను... అని అన్నారు. నిజానికి ఇలాంటి వాటిని అస్స‌లు ప‌ట్టించుకోకూడ‌ద‌ని, నిజ జీవితం వేరు.. ఆన్ లైన్ వ్య‌వ‌హారాలు వేరు అని కూడా మృణాల్ విశ్లేషించారు. ``ఒక రోజు, రెండు రోజులు, మూడు రోజులు, వారాలు, నెలలు ఎన్నో అనుభ‌వాలు.. కానీ మీ కుటుంబం తప్ప మిమ్మ‌ల్ని ఎవరూ పట్టించుకోరు.. చెడు రోజులు ఉంటే, మంచి రోజులు వస్తాయని గుర్తుంచుకోవడం ముఖ్యం`` అని అన్నారు. ట్రోలింగ్ ఎదురైనా కానీ.. దానిని ప‌ట్టించుకోకూడ‌ద‌ని అన్నారు.

నేను నా ఒంపు సొంపుల్ని ప్ర‌ద‌ర్శించ‌డం ద్వారా అందం ప్రమాణాన్ని మార్చాను. ఇంతకు ముందు, నేను శరీరాన్ని హ‌త్తుకునే దుస్తులు ధరించడానికి భయపడ్డాను. కానీ ఇప్పుడు బాడీ-హగ్గింగ్ దుస్తుల‌ను తీసుకురండి అని చెబుతున్నాను.. అని అన్నారు. సంద‌ర్భాన్ని బ‌ట్టి ప్ర‌తిదీ మార్చాల‌ని కూడా అభిప్రాయ‌ప‌డ్డారు. బాడీ షేమింగ్ ని సీరియ‌స్ స‌మ‌స్య‌గా తీసుకోకూడ‌ద‌ని మృణాల్ మాట‌ల‌ను బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. ఇటీవ‌ల‌ మాన‌వ సంబంధాలు సంక్లిష్ఠంగా మారినందున తాను త‌న అండాల‌ను దాచి పెట్టుకుంటాన‌ని ఇంత‌కుముందు మృణాల్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

సీతా రామం, సూపర్ 30, తూఫాన్, బాట్లా హౌస్, లవ్ సోనియా, ఘోస్ట్ స్టోరీస్ స‌హా ప‌లు చిత్రాల్లో త‌న న‌ట‌న‌కు అద్భుత ప్ర‌శంస‌లు కురిసాయి. కార్తిక్ ఆర్యన్‌తో ధమాకా.. షాహిద్ కపూర్‌తో జెర్సీలోను న‌టించింది. మృణాల్ ఠాకూర్ చివరిగా విజయ్ దేవరకొండతో కలిసి `ఫ్యామిలీ స్టార్` చిత్రంలో కనిపించింది. గతంలో నాని సరసన హాయ్ నాన్నా సినిమాలో నటించింది. త‌దుప‌రి `పూజా మేరీ జాన్‌` అనే చిత్రంలో నటించనుంది.

Tags:    

Similar News