1000 సార్లు చూసే షాట్.. ఈ నాలుగు పక్కా బ్లాక్ బస్టర్స్..!
నిర్మాణ సంస్థ నుంచి 6 భారీ సినిమాలు రాబోతున్నాయని అన్నారు రవి శంకర్.;

2026 మైత్రి మూవీ మేకర్స్ నుంచి భారీ సినిమాలు రాబోతున్నాయి. వాటి గురించి లేటెస్ట్ గా మైత్రి నిర్మాతల్లో ఒకరైన రవి శంకర్ చెప్పుకొచ్చారు. 2026 మైత్రి సంస్థకు హ్యూజ్ ఇయర్ కాబోతుందని అన్నారు. నిర్మాణ సంస్థ నుంచి 6 భారీ సినిమాలు రాబోతున్నాయని అన్నారు రవి శంకర్. అందులో నాలుగు సినిమాలైతే పక్కా బ్లాక్ బస్టర్స్ అని అన్నారు.
ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబో, రామ్ చరణ్ బుచ్చి బాబు సినిమా, జై హనుమాన్, ప్రభాస్ హను రాఘవపూడి మూవీ, పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, విజయ్ దేవరకొండ రాహుల్ సంకృత్యన్ ప్రాజెక్ట్ ఇలా నెక్స్ట్ రాబోతున్న ఆరు సినిమాల గురించి చెప్పారు నిర్మాత రవి శంకర్.
ఎన్టీఆర్ నీల్ ఏ స్టాండర్డ్ ఊహించుకున్నా...
మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో సినిమా గురించి చెబుతూ ఆ సినిమా ఇంటర్నేషనల్ సినిమా అని అన్నారు నిర్మాత రవి శంకర్. మీరు ఏ స్టాండర్డ్స్ ఊహించుకున్నా అది వేరే లెవెల్ అని అన్నారు.
రామ్ చరణ్ సినిమా ఒక్క షాట్ కోసం 1000 సార్లు..
రామ్ చరణ్ తో బుచ్చి బాబు సినిమా షూటింగ్ జరుగుతుందని చెప్పిన రవి శంకర్. టీజర్ లో ఒక్క షాట్ ఎక్సలెంట్ గా ఉంటుంది. ఆ షాట్ కోసమే టీజర్ 1000 సార్లు చూస్తారని అన్నారు.
హను ప్రభాస్ ఎమోషనల్..
ప్రభాస్ తో హను రాఘవపూడి చేస్తున్న సినిమా రష్ చూశానని ఆ సినిమా స్క్రీన్ ప్లే మ్యాజిక్ చేస్తుందని. రష్ చూస్తేనే ఎమోషనల్ సీన్స్ బాగున్నాయని అన్నారు మైత్రి నిర్మాత రవి శంకర్.
జై హనుమాన్ కోసం ఎసెట్ బిల్డింగ్..
ప్రశాంత్ వర్మ రిషబ్ శెట్టి చేస్తున్న జై హనుమాన్ కోసం ఎసెట్ బిల్డింగ్ అవుతుందని. నవంబర్ లో రిషబ్ శెట్టి షూటింగ్ లో జాయిన్ అవుతారని ఆ సినిమా కూడా మ్యాజిల్ చేస్తుందని అన్నారు.
ఈ నాలుగు సినిమాలు నాలుగు హిట్టు సూపర్ హిట్ కాదు పక్కా బ్లాక్ బస్టర్ అవుతాయని అన్నారు రవి శంకర్. వీటితో పాటు పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది. ఆయన సినిమా అంటే ఏ పాన్ ఇండియా సినిమా బజ్ జరిపోదు. ఎక్స్ ట్రాడినరీగా స్క్రిప్ట్ వచ్చింది. ఈ ఇయర్ షూట్ చేసి నెక్స్ట్ ఇయర్ అది రిలీజ్ చేస్తామని అన్నారు రవి శంకర్.
విజయ్ దేవరకొండ రాహుల్ సంకృత్యన్ సినిమా కూడా ఉందని. రాహుల్ ఈ సినిమా కోసం రెండున్నర ఏళ్లు స్క్రిప్ట్ వర్క్ చేశాడని. చాలా మంచి కథ డీటైలింగ్ ఉంటుందని అన్నారు. 2026 లో మేము సంథింగ్ బిగ్ అచీవ్ మెంట్ సాధిస్తామని అన్నారు మైత్రి నిర్మాత రవి శంకర్.