మైత్రి సొంత సినిమాకే పోటీ దించుతున్నారుగా..?
కొన్నిసార్లు తమ సినిమాకు పోటీగా మరో సినిమా అది కూడా తమ బ్యానర్ నుంచే రిలీజ్ చేస్తుంటారు.;
కొన్నిసార్లు తమ సినిమాకు పోటీగా మరో సినిమా అది కూడా తమ బ్యానర్ నుంచే రిలీజ్ చేస్తుంటారు. ఇది ఈమధ్య ఎక్కువ రిపీట్ అవుతూ వచ్చింది. రెండేళ్ల క్రితం మైత్రి మూవీ మేకర్స్ సంక్రాంతి సీజన్ లో వాళ్లు నిర్మించిన వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి రెండింటినీ రిలీజ్ చేశారు. రోజు గ్యాప్ తో రిలీజైన ఈ సినిమాలు రెండు సక్సెస్ సాధించి మైత్రి సంస్థకు మంచి లాభాలు తెచ్చాయి. ఐతే అందులో ఏ సినిమా పోయినా నిర్మాతకు నష్టమే.
అలానే ఈ సంక్రాంతికి దిల్ రాజు కూడా గేం ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం వదిలారు. ఇక ఆ సినిమాల ఫలితాలు తెలిసిందే. ఒకటి ఫ్లాప్ కాగా మరోటి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఐతే పండగ సీజన్ కాబట్టి అలా ఒకే సంస్థ నుంచి రెండు సినిమాలు వచ్చినా ఆడియన్స్ చూస్తారులే అన్న నమ్మకం ఉంటుంది. కానీ లేటెస్ట్ గా మరోసారి మైత్రి సంస్థ మళ్లీ అలాంటి రిస్క్ నే చేస్తుంది.
మైత్రి మూవీ మేకర్స్ నితిన్ తో చేసిన రాబిన్ హుడ్ సినిమా మార్చి 28న రిలీజ్ అవుతుంది. ఈ సినిమాను వెంకీ కుడుముల డైరెక్ట్ చేశారు. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు మంచి బజ్ ఉంది. ఈ సినిమాకు ఒకరోజు ముందు కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రం వీర ధీర శూర సినిమా రిలీజ్ చేస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్. విక్రం సినిమా డబ్బింగ్ ని కూడా మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేస్తున్నారు.
సొంత సినిమాకు పోటీగా అది కూడా డబ్బింగ్ సినిమా రిస్క్ కదా అంటే.. రాబిన్ హుడ్ మీద వారికి ఉన్న నమ్మకం అలాంటిదని అంటున్నారు. ఐతే విక్రం ఈమధ్య అసలేమాత్రం ఫాంలో లేడు. కానీ వీర ధీర శూర సినిమా టీజర్ మాత్రం ఇంప్రెస్ చేసింది. సినిమా అనుకున్న రేంజ్ లో ఉంటే మాత్రం రాబిన్ హుడ్ కి గట్టి షాక్ తగిలే ఛాన్స్ ఉంది. అంతేకాదు మార్చి 29న మ్యాడ్ స్క్వేర్ సినిమా కూడా వస్తుంది. ఆ సినిమా కోసం కూడా యూత్ ఆడియన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మరి మైత్రి మూవీ మేకర్స్ నిర్ణయం వారికి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.