సూపర్‌స్టార్‌కి క్యాన్సర్ .. అసలు నిజం ఇదీ!
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి క్యాన్సర్ నిర్ధారణ అయిందని పుకార్లు వెలువడ్డాయి. ఈ వార్తలు వేగంగా వైరల్ కావడంతో మమ్ముట్టి అభిమానులు కంగారు పడ్డారు.;
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి క్యాన్సర్ నిర్ధారణ అయిందని పుకార్లు వెలువడ్డాయి. ఈ వార్తలు వేగంగా వైరల్ కావడంతో మమ్ముట్టి అభిమానులు కంగారు పడ్డారు. అయితే ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని అతడి పీఆర్ టీమ్ అధికారికంగా ప్రకటించింది. మమ్ముట్టి ఆరోగ్యంగానే ఉన్నారని టీమ్ ధృవీకరించింది.
మమ్ముట్టి రంజాన్ ఉపవాసంలో ఉన్నందున కొద్దిరోజులుగా విశ్రాంతి తీసుకుంటున్నారు. కానీ మీడియా ఆయనపై తప్పుడు ప్రచారం చేస్తోంది. ఈ విరామం తర్వాత మోహన్ లాల్ తో కలిసి తన తదుపరి సినిమా షూటింగుకు మమ్ముట్టి హాజరవుతారని పీఆర్ టీమ్ పేర్కొంది. ఆయనపై నకిలీ వార్తల్ని ప్రచారం చేయొద్దని కోరారు.
మమ్ముట్టి- మోహన్ లాల్ కాంబినేషన్ మూవీ MMMN (తాత్కాలిక టైటిల్) కంటే ముందు మమ్ముట్టి, మోహన్‌లాల్ అనేక ప్రాజెక్ట్‌లలో పనిచేశారు. ఇద్దరు అగ్ర హీరోలు గతంలో అరడజను పైగా సినిమాల్లో కలిసి నటించారు. అవిడతేపోలే ఇవిడెయుమ్, అదియోఝుక్కుకల్, కరింపిన్పూవినక్కరే, మజా పెయ్యున్ను మద్దలం కొట్టున్ను, అధ్వైతం, విష్ణులోకం, నెం.20 మద్రాస్ మెయిల్ వంటి సినిమాల్లో నటించారు.
మమ్ముట్టితో నయనతార పలు బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు ఇప్పటికే. ఇప్పుడు ముగ్గురు సూపర్ స్టార్ల కాంబినేషన్ లో ఓ భారీ చిత్రం తెరకెక్కుతుండటం ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రంలో ఫహద్ ఫాసిల్, కుంచాకో బోబన్, షాహీన్ సిద్ధిఖ్, సనల్ అమన్, డానిష్ హుస్సేన్, రేవతి లాంటి సీనియర్ స్టార్లు నటిస్తున్నారు. 150 రోజులకు పైగా సాగే షూటింగ్ ను ఢిల్లీ, హైదరాబాద్, కొచ్చి, విశాఖపట్నం, థాయిలాండ్, శ్రీలంక, అజర్‌బైజాన్, అబుదాబి, లండన్ లో పూర్తి చేస్తారని తెలుస్తోంది. మమ్ముట్టి ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు.