పిక్‌టాక్‌ : నేచురల్‌ స్టార్‌ - రౌడీ స్టార్‌ బాండింగ్‌

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొంది సరిగ్గా పదేళ్ల క్రితం వచ్చిన 'ఎవడే సుబ్రమణ్యం' సినిమా అప్పట్లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.;

Update: 2025-03-17 14:40 GMT

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొంది సరిగ్గా పదేళ్ల క్రితం వచ్చిన 'ఎవడే సుబ్రమణ్యం' సినిమా అప్పట్లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమాలో కీలక పాత్రలో నటించిన విజయ్‌ దేవరకొండకి మంచి గుర్తింపు లభించింది. ఆ సినిమా కారణంగానే టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండకి మంచి గుర్తింపు వచ్చిందనే విషయం తెల్సిందే. ఈ సినిమాలో మాళవిక నాయర్‌, రీతూ వర్మ హీరోయిన్స్‌గా నటించారు. ముఖ్యంగా మాళవిక నాయర్‌ పాత్రకు మంచి స్పందన దక్కింది. అంతే కాకుండా సినిమాలోని ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. చూస్తుండగానే సినిమా వచ్చి పదేళ్లు పూర్తి చేసుకుంది.

'ఎవడే సుబ్రమణ్యం' సినిమా విడుదల అయ్యి మార్చి 21, 2025కి పదేళ్లు పూర్తి కాబోతుంది. 2015 మార్చి 21న విడుదలైన ఈ సినిమాను పదేళ్లు పూర్తి చేసుకుంటున్న కారణంగా రీ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఎవడే సుబ్రమణ్యం సినిమాను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. మార్చి 21న రీ రిలీజ్ రాబోతున్న ఈ సినిమా కోసం మేకర్స్ భారీగానే పబ్లిసిటీ చేస్తున్నారు. ఇటీవల సినిమా యూనిట్‌ సభ్యులు అంతా రీ యూనియన్ అయ్యారు. ఆ సందర్భంగా తీసుకున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్‌ అయిన విషయం తెల్సిందే.

ముఖ్యంగా నేచురల్‌ స్టార్‌ నాని, రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ కలిసి ఉన్న ఫోటోలు వీడియోలు వైరల్‌ అయ్యాయి. కింగ్డమ్‌ లుక్‌లో విజయ్ దేవరకొండ, హిట్‌ 3 లుక్‌ లో నాని ఈ పిక్స్‌లో కనిపించారు. ఇద్దరూ అప్పటికీ ఇప్పటికీ చాలా మారారు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పదేళ్ల తర్వాత రాబోతున్న ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి స్పందన దక్కే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల వారు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. దూద్‌కాశి వంటి అత్యంత కఠినమైన ప్రదేశాల్లో సినిమాను చిత్రీకరించారు. ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా షూటింగ్‌ జరగని ప్రదేశంలో ఈ సినిమాను షూటింగ్‌ చేసినట్లు మేకర్స్ పేర్కొన్నారు.

ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ కింగ్డమ్‌ సినిమాను చేస్తూ ఉండగా నాని ప్రస్తుతం హిట్‌ 3 సినిమాలో నటిస్తున్నాడు. వీరిద్దరు కలిసి ఇలా ఫోటోలకు ఫోజ్ ఇవ్వడంతో అందరి దృష్టిని ఈ ఫోటోలు ఆకర్షిస్తున్నాయి. వైజయంతి మూవీస్ బ్యానర్‌ సోషల్‌ మీడియా అకౌంట్‌లో అధికారికంగా షేర్‌ చేశారు. రీ రిలీజ్‌ బజ్ క్రియేట్‌ చేసే విధంగా ఈ ఫోటోలు ఉన్నాయి. ఎవడే సుబ్రమణ్యం 10 ఏళ్ల సందర్భంగా జరిగిన రీ యూనియన్‌ చాలా ఉత్సాహంగా జరిగింది. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ చాలా సరదాగా అప్పటి సీన్స్‌ను రీ క్రియేట్‌ చేశారు.

Tags:    

Similar News