నభా డ్రీమ్ రోల్ అదే.. అందుకే చెన్నై నుంచి..

నభా నటేష్.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన విషయం తెలిసిందే

Update: 2024-07-14 06:57 GMT

నభా నటేష్.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన విషయం తెలిసిందే. ఆ సినిమా మంచి హిట్ కావడంతో వరుస ఆఫర్లు అందుకుంది. క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది అమ్మడు. కానీ సడెన్ గా ఎవరికీ కనిపించకుండా పోయింది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా లేదు. దీంతో బ్యూటీ ఏమైందోనని అంతా మాట్లాడుకున్నారు. ఇంతలో మళ్లీ బయటకు వచ్చింది.

తనకు పెద్ద యాక్సిడెంట్ జరిగిందని చెప్పింది. అందుకే సినిమాలకు దూరంగా ఉన్నానని తెలిపింది. తన ఎడమ భుజానికి తీవ్రంగా గాయమైందని, మల్టీఫుల్ బోన్ ఫ్రాక్చర్ జరిగాయని చెప్పింది. కొన్ని కాంప్లికేటెడ్ సర్జరీలు కూడా జరిగాయని పేర్కొంది. మళ్లీ ఫిట్ గా అయ్యి ముందు ఎనర్జీ సంపాదించుకున్న తర్వాత స్క్రీన్ పై కనిపించాలని భావించిందట నభా నటేష్. అందుకే లాంగ్ గ్యాప్ తీసుకుని ఇప్పుడు టాలీవుడ్ మెల్లగా బిజీగా మారుతోంది.

మరికొద్ది రోజుల్లో డార్లింగ్ మూవీతో రీ ఎంట్రీ ఇవ్వనుంది నభా నటేష్. అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో నటుడు ప్రియదర్శి సరసన నటిస్తోంది. ఇప్పటికే మూవీపై మంచి బజ్ నెలకొంది. ప్రమోషనల్ కంటెంట్ లో నభా నటేష్ అట్రాక్టివ్ గా కనిపిస్తోంది. సినిమాలో స్ప్లిట్ పర్సనాలిటీ ఉన్న రోల్ లో సందడి చేయనుంది. అయితే ఆ పాత్రలో నటించడం చాలా ఛాలెంజింగ్ గా అనిపించిందని లేటెస్ట్ ప్రమోషన్స్ లో చెప్పింది అమ్మడు.

ఇప్పటి వరకు తాను అలాంటి రోల్ చేయలేదని తెలిపింది నభా. కామెడీ ఎంటర్టైనర్ లో అలాంటి క్యారెక్టర్ పెట్టడం చాలా ఇంట్రస్టింగ్‌ గా అనిపించిందని చెప్పింది. మూవీ స్క్రిప్ట్ చెప్పినప్పుడే ఎగ్జయింట్‌ గా అనిపించిందని వెల్లడించింది. డార్లింగ్ లో చేసిన పాత్ర తన డ్రీమ్ రోల్ లాంటిదని తెలిపింది. స్ప్లిట్ పర్సనాలిటీ ఉన్న చాలా సినిమాలు చూశానని, చెన్నై నుంచి ఒక యాక్టింగ్ స్పెషలిటేటర్ కూడా వచ్చారని పేర్కొంది.

దాదాపు రెండేళ్లుగా తాను నటించిన సినిమా రిలీజ్ కాలేదని తెలిపింది. థియేటర్స్‌ లో తెలుగు ప్రేక్షకులు నన్ను చూడటంతోపాటు తనను తాను చూసుకోవడానికి ఈగర్‌ గా వెయిట్ చేస్తున్నట్లు పేర్కొంది. ప్రియదర్శితో నటించడం చాలా బాగుందని చెప్పింది. ఆయన కామెడీ టైమింగ్ సో నేచరుల్ అంటూ కొనియాడింది. మొత్తానికి జులై 19వ తేదీన రిలీజ్ కానున్న డార్లింగ్ మూవీతో నభా నటేష్ రీ ఎంట్రీలో ఎలాంటి హిట్ కొడుతుందో చూడాలి.

Tags:    

Similar News