డాకు హైప్ పెంచిన నిర్మాత మాటలు
బాలకృష్ణ కెరీర్‌లో చాలా ప్రత్యేక సినిమాగా ఇది ఉంటుంది అంటూ నిర్మాత నాగవంశీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
సంక్రాంతికి నందమూరి బాలకృష్ణ నటించిన 'డాకు మహారాజ్' సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వాల్తేరు వీరయ్య వంటి కమర్షియల్ హిట్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, ఇండస్ట్రీలో ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మించడం జరిగింది. ఈ భారీ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12, 2025లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. బాలకృష్ణ కెరీర్‌లో చాలా ప్రత్యేక సినిమాగా ఇది ఉంటుంది అంటూ నిర్మాత నాగవంశీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ... డాకు మహారాజ్ సినిమాలో బాలకృష్ణ గారిని ఆయన ఫ్యాన్స్ ఎలా అయితే చూడాలి అనుకుంటున్నారో అలాగే చూడబోతున్నారు. ముఖ్యంగా డాకు పాత్రలో ఆయన్ను చూస్తూనే ఉండిపోతారు. సినిమాలో వచ్చే ఇంటర్వెల్‌కి ముందు సన్నివేశాలు ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి. 20 నిమిషాల పాటు అద్భుతమైన ఫీల్‌ను కలిగించే విధంగా సీన్స్ ఉంటాయి. ఈ సినిమాను అభిమానులు ఎంతగా ఎంజాయ్ చేస్తారో ప్రేక్షకులు అదే స్తాయిలో ఎంజాయ్ చేస్తారు. సినిమాలోని ప్రతి సన్నివేశం బాలకృష్ణ ఫ్యాన్స్ పేపర్స్ చించి వేసే స్థాయిలో ఉంటుంది. కచ్చితంగా ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా ఉంటుంది అంటూ ఆయన నమ్మకం వ్యక్తం చేశాడు. వంశీ మాటలు సినిమాపై అంచనాలు భారీగా పెంచాయి.
బాలకృష్ణ వరుసగా అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టాడు. హ్యాట్రిక్ కొట్టిన హీరోతో సినిమా అంటే కచ్చితంగా దర్శకుడికి, నిర్మాతకు ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిని జయించి దర్శకుడు బాబీ అద్భుతమైన సినిమాను బాలయ్యతో రూపొందించారని నాగవంశీ చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో ఉండే కొన్ని సన్నివేశాలు అందరినీ సర్‌ప్రైజ్ చేయడంతో పాటు తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించే విధంగా ఉంటాయని హామీ ఇచ్చారు. సినిమాలోని బాలకృష్ణ లుక్‌కి ఇప్పటికే మంచి పేరు వచ్చిన విషయం తెల్సిందే. కనుక ఈ సినిమా సంక్రాంతికి ఒక మంచి వినోదాన్ని ఇవ్వబోతుంది.
ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా శ్రద్దా శ్రీనాథ్ కీలక పాత్రలో కనిపించబోతుంది. బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకి తమన్ అందించిన సంగీతం ఆకట్టుకుంది. ముఖ్యంగా టైటిల్ సాంగ్ ఫ్యాన్స్‌కి ఊపు తెచ్చే విధంగా నిలిచింది. ఇక ఎప్పటిలాగే తమన్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో బాలకృష్ణ ఫ్యాన్స్‌కి పిచ్చెక్కించడం ఖాయం అనే నమ్మకం వ్యక్తం అవుతోంది. బాలకృష్ణ హ్యాట్రిక్ మూవీస్‌కి తమన్ సంగీతాన్ని అందించాడు. కనుక సెంటిమెంట్ ప్రకారం ఈ సినిమా సైతం సూపర్ హిట్, ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ సూపర్ హిట్ అని అంటున్నారు.