బాల‌య్య సినిమాపై నిర్మాత కాన్పిడెన్స్ చిటికేసి మ‌రీ!

ఈ నేప‌థ్యంలో `డాకు మ‌హారాజ్` నిర్మాత నాగ‌వంశీ త‌న ప్రొడ‌క్ట్ పై చిటికేసి మ‌రీ న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేసారు.

Update: 2024-12-23 08:30 GMT

న‌ట‌సింహ బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా న‌టించిన `డాకు మ‌హారాజ్` భారీ అంచ‌నాల మధ్య జ‌న‌వ‌రి 12న రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. `అఖండ‌`, `వీర‌సింహారెడ్డి`, `భ‌గ‌వంత‌కేస‌రి`తో విజ‌యాల‌తో హ్యాట్రిక్ న‌మోదు చేసారు. `డాకు మ‌హారాజ్` కూడా హిట్ అయితే డ‌బుల్ హ్యాట్రిక్ ని టార్గెట్ చేయ‌డం ప‌క్కా. అందుకు త‌గ్గ‌ట్టే బాల‌య్య ప్ర‌ణాళిక క‌నిపిస్తుంది. ఇప్ప‌టికే త‌దుప‌రి సినిమా డైరెక్ట‌ర్ గా బోయ‌పాటి శ్రీనును లాక్ చేసారు. ఆ కాంబోలో `అఖండ తావ‌డం` రాబోతుంది.

ఈ కాంబోలో హిట్ ప‌డిదే అది నాల్గ‌వ చిత్రం అవుతుంది. ఈ నేప‌థ్యంలో `డాకు మ‌హారాజ్` నిర్మాత నాగ‌వంశీ త‌న ప్రొడ‌క్ట్ పై చిటికేసి మ‌రీ న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేసారు. బోయ‌పాటి-బాల‌య్య కాంబోపై త‌న న‌మ్మ‌కంతో మ‌రింత ఒత్తిడిని పెంచేసారు. బాల‌య్యగ‌త సినిమాల్ని డాకు మ‌హారాజ్ కొట్టేస్తుందా? అంటే మీరు చెప్పిన నాలుగు సినిమాల కంటే బెట‌ర్ సినిమా అని నాగ‌వంశీ వేలెత్తి చిటికేసి మ‌రీ చెప్పారు. అంత న‌మ్మ‌కం దేనికి  మీ గ‌ట్స్ ఏంటి? అంటే.. నా సినిమా నాకు తెలియ‌దా? సినిమా చూసుకున్నాను.

సినిమా అయ్యే వ‌ర‌కూ కూడా వెయిట్ చేయ‌రు. ఇంట‌ర్వెల్ లోనే మీరు ఫోన్ చేసి 'అఖండ' కంటేనో,'లెజెండ్' కంటేనే బాగుంటుంద‌ని ప్ర‌శ్నించిన జ‌ర్నిలిస్టే చెబుతార‌ని నాగ‌వంశీ ధీమా వ్య‌క్తం చేసారు. దీంతో డాకు మ‌హారాజ్ పై నిర్మాత ఎంత కాన్పిడెంట్ గా ఉన్నారు? అన్న‌ది అద్దం ప‌డుతుంది. ఈ చిత్రానికి బాబి దర్శ‌క‌త్వం వ‌హించిన సంగ‌తి తెలిసిందే. బాబికి ద‌ర్శ‌కుడిగా అత‌టి ట్రాక్ తిరుగు లేదు.

గ‌త సినిమా మెగాస్టార్ చిరంజీవితో 'వాల్తేరు వీర‌య్య'తెర‌కెక్కించి మాంచి మాస్ హిట్ అందించారు. చిరంజీవి ఎంత‌గానో అభిమానించి చేసి చేసిన చిత్రమ‌ది. బాల‌య్య సినిమా విష‌యంలోనూ అలాగే ఫీల‌వుతున్నారు. గ‌త సినిమాల కంటే న‌ట‌సింహాన్ని కొత్త‌గా చూపించే త‌న వంతు ప్ర‌య‌త్నం తాను చేసిన‌ట్లు చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News