లక్కీ భాస్కర్ - సార్.. ఆ హీరోలు రిజెక్ట్ చేశారా?

అయితే తాజాగా రిలీజ్ అయిన ఓ సూపర్ హిట్ సినిమాను నాని మిస్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

Update: 2024-11-03 04:32 GMT

టాలీవుడ్ లో టైర్ 2 హీరోలుగా తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నటులు న్యాచురల్ స్టార్ నాని, అక్కినేని హీరో నాగచైతన్య. నాని వరుసగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో టాప్ హీరో రేంజ్ కి దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం నాని శైలేష్ కొలను దర్శకత్వంలో చేస్తున్న ‘హిట్ 3’ మూవీ బడ్జెట్ 100 కోట్లు అని తెలుస్తోంది. నెక్స్ట్ శ్రీకాంత్ ఓదేల దర్శకత్వంలో చేయబోయే సినిమా కూడా 100 కోట్లకి పైగా బడ్జెట్ తోనే తెరకెక్కనున్నట్లు సమాచారం. అయితే తాజాగా రిలీజ్ అయిన ఓ సూపర్ హిట్ సినిమాను నాని మిస్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన ‘లక్కీ భాస్కర్’ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. నిజానికి ఈ సినిమా కథని వెంకీ అట్లూరి ముందుగా నానికి నేరేట్ చేశారంట. అయితే కారణాలేంటనేది తెలియదు కానీ నాని ఈ కథను ఒప్పుకోలేదని టాక్. దీంతో వెంకీ అట్లూరి దుల్కర్ సల్మాన్ కి కథని చెప్పి ఓకే చేయించుకున్నారు. దీపావళి సందర్భంగా రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. అలాగే ఈ మధ్యకాలంలో వచ్చిన బెస్ట్ సినిమాలలో ఒకటనే గుర్తింపుని సొంతం చేసుకుంది.

సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేని వారు కూడా ‘లక్కీ భాస్కర్’ మూవీ కథపై ప్రశంసలు కురిపిస్తున్నారు. దీంతో నాని ఒక మంచి సక్సెస్ ని మిస్ చేసుకున్నారనే మాట వినిపిస్తోంది. వెంకీ అట్లూరి ‘లక్కీ భాస్కర్’ కంటే ముందు తమిళ్ హీరో ధనుష్ తో ‘సార్’ మూవీ చేసి సక్సెస్ అందుకున్నారు. కార్పొరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పై విమర్శనాస్త్రంగా ‘సార్’ మూవీ ఉంటుంది. ధనుష్ స్ట్రైట్ తెలుగులో చేసిన మొదటి సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమాతో ధనుష్ బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకున్నారు. మూవీ ఏకంగా 100 కోట్లకి పైగా కలెక్షన్స్ సొంతం చేసుకుంది.

ఈ కథని వెంకీ అట్లూరి ముందుగా నాగచైతన్యకి చెప్పారంట. చైతు కథపై పెద్ద ఆసక్తి చూపించలేదని టాక్. అయితే చైతన్య ఈ సినిమా ఎందుకు ఒప్పుకోలేదనేది క్లారిటీ లేదు. కానీ మంచి సూపర్ హిట్ సినిమాలో నటించే అవకాశం కోల్పోయాడని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. వెంకీ అట్లూరి కూడా తన కథలని తెలుగు స్టార్స్ చేయడానికి ముందుకు రాకపోవడంతోనే ఇతర భాషలలో ఉన్న హీరోలతో చేసి సక్సెస్ లు అందుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో టాక్ నడుస్తోంది.

వెంకీ నెక్స్ట్ సినిమా అయిన తెలుగు హీరోతో చేస్తాడా లేదంటే ఇతర భాష నటులకే ప్రాధాన్యత ఇస్తాడా అనేది తెలియాల్సి ఉంది. అతని నెక్స్ట్ సినిమా కూడా సితార ఎంటర్టైన్మెంట్స్ లోనే ఉండే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలలో అనుకుంటున్నారు. రెండు సక్సెస్ లు అందుకున్న తర్వాత కచ్చితంగా బడా నిర్మాతల నుంచి వెంకీ అట్లూరికి ఆఫర్స్ రావడం గ్యారెంటీ. ప్రస్తుతం వెంకీ ‘లక్కీ భాస్కర్’ సినిమా సక్సెస్ ని ఆస్వాదిస్తున్నారు. లాంగ్ రన్ లో ఈ సినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుంటుందని అంచనా వేస్తున్నారు. దీని తర్వాత కొంత గ్యాప్ తీసుకొని వెంకీ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

Tags:    

Similar News