నాని మార్కెట్ ని నమ్మని నిర్మాతలు..?

నాని తన సినిమా ఎంత బడ్జెట్ లో చేయాలన్నది తనకు కూడా ఒక ఐడియా ఉంటుంది. తన మార్కెట్ ని మించి నాని ఎప్పుడు రిస్క్ చేసిన సందర్భాలు లేవు.

Update: 2024-02-13 05:18 GMT

మీడియం రేంజ్ హీరోల్లో మినిమం గ్యారెంటీ హీరోగా క్రేజ్ తెచ్చుకున్న స్టార్ న్యాచురల్ స్టార్ నాని. ఆయన సినిమా రిలీజ్ అవుతుంది అంటే నాని ఫ్యాన్స్ తో పాటుగా కామన్ ఆడియన్స్ కూడా అలర్ట్ అవుతారు. నాని సినిమాల హిట్ రేషియో చూస్తే అతని కెరీర్ తో పాటుగా ఇండస్ట్రీకి కూడా మంచి ఫలితాలు అందించే సినిమాలు చేశాడని చెప్పొచ్చు. ఎంచక్కా ఏడాదికి రెండు సినిమాలు అది కూడా కొత్త వారితో చేస్తూ సక్సెస్ ఫాం కొనసాగిస్తున్నాడు నాని.

కొత్త వారితో నిర్మాతని రిస్క్ లో పడేయడం ఎందుకని కాకుండా మొదటి అవకాశం ఇస్తే ఏ డైరెక్టర్ అయినా తన ఫుల్ ఎఫర్ట్ తో పనిచేస్తాడన్న లాజిక్ ని పట్టుకుని నాని సినిమాలు చేస్తున్నాడు. ఆ లెక్క ప్రకారం గానే నాని కొత్త వారితో చేసిన సినిమాలన్నీ కూడా సక్సెస్ అవుతూ వచ్చాయి. లాస్ట్ ఇయర్ దసరా, హాయ్ నాన్న రెండు సినిమాలు మంచి ఫలితాలు అందుకున్నాయి.

దసరా ఐతే నానిని 100 కోట్ల క్లబ్ లో నిలిచేలా చేసింది. ఇదిలాఉంటే లేటెస్ట్ గా నాని ఒక సినిమా విషయంలో బడ్జెట్ ఎక్కువ అవ్వడం వల్ల సినిమా ఆగిపోయిందనే టాక్ వచ్చింది. నాని తన సినిమా ఎంత బడ్జెట్ లో చేయాలన్నది తనకు కూడా ఒక ఐడియా ఉంటుంది. తన మార్కెట్ ని మించి నాని ఎప్పుడు రిస్క్ చేసిన సందర్భాలు లేవు. ఈమధ్య ఒక సినిమా విషయంలో బడ్జెట్ కాస్త ఎక్కువ అవుతుందని తెలిసి నాని అయినా పర్వాలేదు అనుకున్నాడట.

నాని మీద నమ్మకం ఉన్నా ఇంత రిస్క్ ఎందుకని నిర్మాత మాత్రం వెనక్కి తగ్గినట్టు టాక్. ఓ తమిళ దర్శకుడి తో నాని చేయాల్సిన సినిమాకు ఇలా బ్రేక్ పడినట్టు తెలుస్తుంది. ఆ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేస్తే పెట్టే బడ్జెట్ కు బ్యాలెన్స్ అవుతుందని తెలిసినా నిర్మాత ఎందుకో వెనకడుగు వేశాడని టాక్. ఏడాదికి రెండు సినిమాలు తగ్గకుండా రెండు సినిమాలతో 100 కోట్ల దాకా మార్కెట్ చేస్తున్న నాని విషయంలో ఇలా జరగడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ప్రస్తుతం నాని వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో సరిపోదా శనివారం సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత ఏ ప్రాజెక్ట్ చేస్తాడన్నది తెలియాల్సి ఉంది.


Tags:    

Similar News