సరిపోద శనివారం.. ఎంతవరకు వచ్చిందంటే..
నేచురల్ స్టార్ నాని గత ఏడాది రెండు డిఫరెంట్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్నాడు
నేచురల్ స్టార్ నాని గత ఏడాది రెండు డిఫరెంట్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్నాడు. దసరా సినిమాలో ఊర మాస్ క్యారెక్టర్ తో మెప్పించిన నాని ఆ తరువాత హాయ్ నాన్న సినిమాలో ఎమోషన్ లవ్ జర్నీతో సరికొత్తగా ఆకట్టుకున్నాడు. ఇక తన రాబోయే పాన్ ఇండియా చిత్రం సరిపోద శనివారంలో సూర్య పాత్రలో మునుపెన్నడూ లేని విధంగా కనిపించబోతున్నాడు.
ఈ సినిమా పోస్టర్స్ తోనే ఒక పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేస్తోంది. పవర్-ప్యాక్డ్ క్యారెక్టర్లో కనిపించనున్నాడు అని ఫస్ట్ లుక్ టీజర్ లో హైలెట్ చేశారు, ఇక సినిమా షూటింగ్ లో అస్సలు గ్యాప్ రావడం లేదు. అనుకున్న టైమ్ కంటే సినిమా వర్క్ తొందరగానే ఫినిష్ అవుతోంది. యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రత్యేకమైన సినిమా నాని కెరీర్ లోనే ఒక బిగ్ హిట్ గా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు.
భారీ బడ్జెట్‌తో డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య మరియు కళ్యాణ్ దాసరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ మధ్యకాలంలో చిత్ర బృందం క్లైమాక్స్ షూటింగ్‌ను ప్రారంభించింది. ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్‌ను నిర్మించారు. ఇక అక్కడే నానితో పాటు కొంతమంది ప్రముఖ నటీనటులు పాల్గొన్నారు.
ఈ క్లైమాక్స్ సినిమా చాలా డిఫరెంట్ గా ఉండనున్నట్లు తెలుస్తోంది. నాని యాక్షన్ డోస్ తో పాటు కథలో సీరియస్ డ్రామా కూడా ఆడియెన్స్ కు మంచి కిక్ ఇచ్చే విధంగా ఉంటుందట. సినిమాలో క్యూట్ హీరోయిన్ ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తుండగా, స్టార్ డైరెక్టర్ సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక మురళి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు, జేక్స్ బిజోయ్ సంగీతం సమకూర్చారు.
ఇక సినిమా రిలీజ్ డేట్ పై కూడా ముందుగానే క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాను ఆగస్టు 29 విడుదల చేయబోతున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి కార్తీక శ్రీనివాస్ ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. అయితే ఆ మధ్య రిలీజ్ డేట్ విషయంలో కొన్ని గాసిప్స్ కూడా వైరల్ అయ్యాయి. అనుకున్న సమయానికి సినిమా రాకపోవచ్చని టాక్ వచ్చింది. అయితే అందులో నిజం లేదని మేకర్స్ ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూనే ఉన్నారు. మరి ఈ సినిమా నాని కెరీర్ కు ఎలాంటి బూస్ట్ ఇస్తుందో చూడాలి.