ఆ చెత్త ఎంపిక చాలా నేర్పింది: న‌య‌న్

కొన్ని సంవత్సరాల క్రితం పాపుల‌ర్ మీడియాతో పాత ఇంటర్వ్యూలో న‌య‌న్ త‌న బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం గ‌జినీలో ఆఫ‌ర్ గురించి ప్ర‌స్థావిస్తూ .. అది త‌న జీవితంలో అత్యంత చెత్త ఎంపిక‌ అని వ్యాఖ్యానించారు.

Update: 2024-06-21 03:15 GMT

లేడీ సూపర్ స్టార్ న‌యనతార భారతదేశంలోని అగ్ర‌క‌థానాయిక‌ల్లో ఒకరు. తమిళం, తెలుగు, మలయాళం పరిశ్రమల్లో ఓ వెలుగు వెలిగిన న‌య‌న్ ఇటీవలే షారుఖ్ ఖాన్ నటించిన 'జవాన్'తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అయితే కెరీర్ లో ఎన్నో ఛాలెంజింగ్ రోల్స్ లో న‌టించిన న‌య‌న‌తార త‌న చెత్త ఎంపిక గురించి తాజా ఇంట‌ర్వ్యూలో మాట్లాడింది.

కొన్ని సంవత్సరాల క్రితం పాపుల‌ర్ మీడియాతో పాత ఇంటర్వ్యూలో న‌య‌న్ త‌న బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం గ‌జినీలో ఆఫ‌ర్ గురించి ప్ర‌స్థావిస్తూ .. అది త‌న జీవితంలో అత్యంత చెత్త ఎంపిక‌ అని వ్యాఖ్యానించారు. తన సినీకెరీర్ గురించి మాట్లాడుతూ.. తన సినిమాల‌ మొత్తం జాబితాలో 'గజిని'లో నటించినందుకు మాత్రమే చింతిస్తున్నానని చెప్పింది. ఇది తన జీవితంలో చెత్త ఎంపిక అని న‌య‌న్ తెలిపింది. నయనతార ఈ చిత్రంలో తన పాత్రను త‌న‌కు చెప్పినట్లుగా చిత్రీక‌రించ‌లేదని.. తనను చెత్త‌గా ఫోటో తీశారని చెప్పింది. ఆ సమయంలో తాను దానిని పట్టించుకోలేదని దానిని ఒక లెర్నింగ్ ప్రాసెస్ గా భావించానని నయ‌న‌తార‌ పేర్కొంది. ఈ చిత్రంలో సూర్య - అసిన్ ప్రధాన పాత్రలలో నటించారు. నయనతార సహాయక పాత్రను పోషించింది. గ‌జినీలో న‌ట‌న‌కు ఆస్కారం ఉన్న పాత్ర‌లో అశిన్ అద్భుతంగా న‌టించ‌గా, గ్లామ‌ర్ డాళ్ త‌ర‌హా పాత్ర‌లో న‌య‌న‌తార త‌న‌దైన శైలిలో క‌వ్వించింది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.... నయనతార చివరిగా 'అన్నపురాణి' చిత్రంలో కనిపించింది. ఇది న‌య‌న్ కెరీర్ 75వ చిత్రం. ఇప్పుడు 'టాక్సిక్' షూటింగ్‌లో బిజీగా ఉంది. గీత మోహన్‌దాస్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. యష్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నాడు. మలయాళంలో నివిన్ పౌలీతో తన తదుపరి చిత్రానికి కూడా న‌య‌న‌తార సంత‌కం చేసింది. టెస్ట్ అనే చిత్రంలోను నటిస్తోంది. టెస్ట్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉంది. శశికాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం స్పోర్ట్స్ డ్రామా. ఇందులో మాధవన్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో నటించారు. నటిగా 'మనగట్టి సిన్స్ 1960' అనే సినిమా కూడా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్నాయి.

Tags:    

Similar News