నిధి అగర్వాల్ కి పన్నీరు ముక్కలే మటన్ ముక్కలా!
తాజాగా నిధి అగర్వాల్ ఇష్టంగా తినే ఆహారం గురించి ఓపాడ్ కాస్ట్ లో రివీల్ చేసింది. 'ఆహారం గురించి ఎక్కువగా మాట్లాడను.
డైటింగ్ పేరుతో సెలబ్రిటీలు రుచికరమైన ఆహార పదార్దలకు దూరంగా ఉండగా తప్పదు. అప్పుడప్పుడు తప్ప రెగ్యులర్ గా ఇష్టమైన పదార్దాలు తీసుకోవడం కుదరదు. సెలబ్రిటీ లైఫ్ లో ఇలాంటి త్యాగం తప్పదు. పాత్రల కోసం మరింత స్లిమ్ లుక్ ..జీరో లుక్ లోకి మారాల్సిన వచ్చినప్పుడు ఆహార నియమలు మరింత కఠినంగా పాటించాల్సి ఉంటుంది. ఈ విషయంలో యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ కూడా ఎక్కడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి ఉండదం టోంది.
తాజాగా నిధి అగర్వాల్ ఇష్టంగా తినే ఆహారం గురించి ఓపాడ్ కాస్ట్ లో రివీల్ చేసింది. 'ఆహారం గురించి ఎక్కువగా మాట్లాడను. ఎందుకంటే పోడవైన వాళ్లు అంతా వాటి గురించి ఎక్కువగా మాట్లాడుతారు. నేను మంచి పుడీనే. రుచికరమైన ఆహార పదార్దాలు వేటిని వదలను. కానీ చాలా పరిమితంగానే వాటిని తీసుకుంటాను. ఎక్కుగా ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని తినడానికే ఇష్టపడతాను. చాలా రేర్ గా బయట పుడ్ తీసుకుంటాను.
పూర్తిగా శాఖాహారిని. నాన్ వెజ్ ఐటమ్స్ జోలికి వెళ్లను. కానీ వెజ్ లో పన్నీరు అంటే ఇష్టం. ఆ టేస్టులో చికెన్..మటన్ టేస్ట్ ఉంటుందని ఫీలై తింటాను. ప్రభాస్ గురించి పుడ్ టాపిక్ తెస్తే? ప్రమాదం. అడగాలే కానీ కాదనకుండా ప్రతీ వంటకం పంపిస్తారు. ఆయన ఆ విషయంలో ఎంతో స్వీట్ పర్సన్' అనేసింది. ఇక నిధి అగర్వాల్ కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. అందం అభినయం గల నాయిక అయినా బిజీ హీరోయిన్ కాలేకపోయింది.
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తోన్న 'హరిహర వీరమల్లు'లో హీరోయిన్ గా నటిస్తోంది. పవన్ తొలి పాన్ ఇండియా సినిమా ఇది. దీంతో ఈ చిత్రంపై నిధి చాలా ఆశలు పెట్టుకుంది. అలాగే డార్లింగ్ ప్రభాస్ తో కలిసి 'రాజాసాబ్' లోనూ నటిస్తోంది. ఈ సినిమాపై కూడా మంచి అంచనాలున్నాయి. ఇలా ఒకేసారి పవన్ , ప్రభాస్ చిత్రాల్లో భాగమై నెట్టింట వైరల్ అవుతోంది.