భీష్మ 2.O అయితే రాబిన్‌హుడ్ 3.O

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల జంట‌గా న‌టించిన సినిమా రాబిన్‌హుడ్.;

Update: 2025-03-12 04:23 GMT

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల జంట‌గా న‌టించిన సినిమా రాబిన్‌హుడ్. వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా మార్చి 28న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించిన ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ లో గ్రాండ్ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు.

ఈ ప్రెస్ మీట్ లో భాగంగా నితిన్ మాట్లాడిన మాట‌ల్లో రాబిన్‌హుడ్ పై ఎంతో న‌మ్మ‌కం క‌నిపిస్తుంది. తాను, వెంకీ కుడుముల ఆల్రెడీ సినిమా చూశామ‌ని, సినిమా చూశాక దాదాపు గంట పాటూ ఇద్ద‌రూ ప్రేమించుకుని, కౌగిలించుకుని, కామించుకోబోయి ఆపుకున్నామ‌ని, రాబిన్‌హుడ్ త‌న కెరీర్ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలుస్తుందని నితిన్ ధీమా వ్య‌క్తం చేశాడు.

మార్చి 30న త‌న బ‌ర్త్ డే అని, రాబిన్‌హుడ్ మార్చి 28న రిలీజ‌వుతుందని, వెంకీ ఈ సినిమాతో నాకు బిగ్గెస్ట్ బ‌ర్త్ డే గిఫ్ట్ ఇవ్వ‌బోతున్నాడ‌ని, మార్చి 30న అంద‌రికీ గ్రాండ్ గా బ‌ర్త్ డే పార్టీ తో పాటూ రాబిన్‌హుడ్ స‌క్సెస్ పార్టీ ఇస్తాన‌ని నితిన్ తెలిపాడు. ఛ‌లో వెంకీకి 1.O అయితే, భీష్మ 2.O అని, రాబిన్‌హుడ్ 3.O అని నితిన్ అన్నాడు. రాబిన్‌హుడ్ క‌థ‌ను వెంకీ చాలా ఎంటర్టైనింగ్ గా రాసుకున్నాడని నితిన్ చెప్పాడు.

త‌మ సినిమాలో చాలా క్లీన్ కామెడీ ఉంటుంద‌ని, ఎక్క‌డా ఒక్క అస‌భ్య‌క‌ర‌మైన డైలాగ్ కూడా ఉండ‌ద‌ని, రాబిన్‌హుడ్ కోసం వెంకీ మంచి ఆర్గానిక్ కామెడీ రాశాడ‌ని, ఇలాంటి కామెడీని ఈ మ‌ధ్య తానెక్క‌డా చూడ‌లేద‌ని, ఎంట‌ర్టైన్మెంట్ తో పాటూ వెంకీ క‌థ‌, ఎమోష‌న్ క్యారీ అయ్యేలా మంచి స్క్రీన్ ప్లే రాసుకున్నాడని నితిన్ తెలిపాడు.

ముఖ్యంగా క్లైమాక్స్ చూసిన త‌ర్వాత ఆడియ‌న్స్ వావ్ అంటార‌ని ఎంతో కాన్ఫిడెంట్ గా చెప్పిన నితిన్, గ‌తేడాది తాను, శ్రీలీల క‌లిసి చేసిన ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్ తో ప‌డిన ఫ్లాప్ ముద్ర ఈ సినిమాతో చెరిగిపోయి హిట్ జోడీగా పేరొస్తుంద‌ని న‌మ్మ‌కంగా చెప్పాడు. ఈ కాన్ఫిడెంట్ చూస్తుంటే నితిన్ ఈసారి గ‌ట్టిగానే హిట్ కొట్టేట్టు క‌నిపిస్తున్నాడు. మ‌రి రాబిన్‌హుడ్ నితిన్ న‌మ్మకాన్ని ఏ మేర‌కు నిల‌బెడుతుందో చూడాలి.

Tags:    

Similar News