వాళ్లకు నిత్యా సూపర్ ఆన్సర్..!
అయినా సరే తెలుగు, తమిళ భాషల్లో తన మార్క్ నటనతో ఆకట్టుకుంటూ వస్తుంది అమ్మడు.
సౌత్ లో సహజ నటిగా గుర్తింపు తెచ్చుకున్న నిత్యా మీనన్ తనకు వచ్చిన ఆ పాపులారిటీని సరిగా వాడుకోలేదని చెప్పొచ్చు. దశాబ్ద కాలం క్రితం యూత్ ఆడియన్స్ అంతా ఆమె నాచురల్ యాక్టింగ్ కు ఫిదా అయ్యారు. ఐతే ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకోవడంలో నిత్యా మీనన్ విఫలమైంది. అయినా సరే తెలుగు, తమిళ భాషల్లో తన మార్క్ నటనతో ఆకట్టుకుంటూ వస్తుంది అమ్మడు. ఇక రీసెంట్ గా తను నటించిన తిరు సినిమాకు నేషనల్ అవార్డ్ కూడా అందుకున్న నిత్యా మీనన్ గోవాలో జరుగుతున్న IffI ఫిల్మ్ ఫెస్టివల్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.
ఇక ఆ ఈవెంట్ లో తన స్పీచ్ తో అలరించింది నిత్యా మీనన్. కెరీర్ తొలి నాళ్లలో తన పాత్రల ఎంపిక పట్ల కొందరు టార్గెట్ చేశారు. ఐతే నటన అనేది మన ఎమోషన్ కి సంబందించింది దానికి అనుభవం అవసరం లేదు. తల్లి పాత్ర చేయాలంటే తల్లి అవ్వాల్సిన అవసరం లేదు. ఆ ఎమోషన్ ని పండిస్తే సరిపోతుందని అన్నారు నిత్యా మీనన్. మనం చేసే పాత్రలతోనే ప్రేక్షకులకు కనెక్ట్ అవుతామని చెప్పిన నిత్యా మీనన్ ఒకప్పుడు తాను ఎమోషనల్ సీన్స్ చాలా తేలికగా చేశా కానీ ఇప్పుడు అలా చేయలేకపోతున్నానని తనలో ఈ మార్పుకి కారణం ప్రస్తుతం తాను ఆనందంగా ఉండటమే అన్నారు నిత్యా మీనన్.
నిజానికి నేషనల్ అవార్డ్ నిత్యా మీనన్ లాంటి టాలెంటెడ్ హీరోయిన్ కి లేట్ గా వచ్చిందని చెప్పాలి. పాత్రకు తగినట్టుగా సహజత్వంతో నిత్యా చూపించే అభినయం సినిమాకు చాలా ప్లస్ అవుతుంది. ఐతే నిత్యా ఈమధ్య ఎందుకో సినిమాలను బాగా తగ్గించేసిని. అది కాక అమ్మడు లుక్ వైజ్ కూడా చాలా మార్పులు వచ్చాయి. ఎలాగు సినిమాలు రావట్లేదని లుక్ మీద దృష్టి పెట్టలేదని అనుకున్నారు.
కోలీవుడ్ లో ధనుష్ తో కలిసి చేసిన తిరు సినిమాలో ఆమె నాచురల్ యాక్టింగ్ మరోసారి నిత్యా మీనన్ సత్తా ఏంటన్నది చాటేలా చేసింది. సినిమాలే కాదు వెబ్ సీరీస్ తో కూడా నిత్యా అదరగొట్టేసింది. ఫ్లాట్ ఫాం ఏదైనా తనకు నచ్చిన కథ, పాత్ర వస్తే చేసేందుకు సిద్ధం అనేస్తుంది అమ్మడు. నిత్యా మీనన్ కి మరోసారి సరైన పాత్ర వస్తే మాత్రం అమ్మడి రేంజ్ ఏంటన్నది మరోసారి ప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
తను చేసే ఎలాంటి పాత్ర అయినా పూర్తిస్థాయిలో మెప్పిస్తూ తన మార్క్ చాటుతున్న నిత్యా సెలెక్టెడ్ సినిమాలను మాత్రమే చేస్తుంది. అందుకే ఆమె సినిమాలు ఎక్కువగా రావట్లేదని చెప్పొచ్చు.