దేవర@1మిలియన్.. వారి వల్లే అంతా: తారక్
కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా.. హై ఓల్టేజ్ మాస్ యాక్షన్ తో సందడి చేయనున్నట్లు రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్ తో క్లారిటీ వచ్చేసింది.
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ను మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై చూసేందుకు ఆయన ఫ్యాన్స్ ఎంతో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆయన దేవర పార్ట్-1 మూవీతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా.. హై ఓల్టేజ్ మాస్ యాక్షన్ తో సందడి చేయనున్నట్లు రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్ తో క్లారిటీ వచ్చేసింది. సినిమాపై ఉన్న అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి.
రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అవ్వనున్న దేవర ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను ముంబైలో నిర్వహించారు. ఈ సందర్భంగా తారక్.. ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. ఆరేళ్ల తర్వాత తన సినిమా సోలో రిలీజ్ అవుతున్నట్లు తెలిపారు. కాస్త టెన్షన్ గా ఉన్నా.. మూవీ కోసం తాను కూడా వెయిట్ చేస్తున్నట్లు చెప్పారు. కొత్త సినిమాను అంతా ఆదరిస్తారని ఆశిస్తున్నానని చెప్పారు.
దేవర మూవీ విజువల్స్ అంతా అద్భుతంగా ఉంటాయని చెప్పి హోప్స్ పెంచారు తారక్. సినిమాలోని చివరి 40 నిమిషాలు వేరే లెవెల్ లో ఉంటుందని చెప్పారు. అండర్ వాటర్‌లో 38 రోజులు చిత్రీకరణ చేశామని పేర్కొన్నారు. హై ఓల్టేజ్ యాక్షన్ తో మూవీ ఉండబోతున్నట్లు తెలిపారు. కొరటాల శివపై తనకు ఉన్న ప్రేమతోపాటు గౌరవం ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటాయని అన్నారు. ఆయనతో చాలా కాలంగా పరిచయం ఉందని పేర్కొన్నారు.
అయితే దేవర రిలీజ్ కు ముందే రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. టికెట్ల ప్రీ సేల్స్ ద్వారా ఏకంగా వన్ మిలియన్ మార్క్ ను చేరుకుంది. ట్రైలర్ కూడా రిలీజ్ కాకముందే ఆ ఘనత సాధించిన మొదటి భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. నెట్టింట రచ్చ రచ్చ చేశారు. ఇప్పుడు ఈ విషయంపై కూడా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడారు.
దేవర టికెట్ల అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే వన్ మిలియన్ డాలర్ల మార్క్ ను చేరడంపై స్పందనేంటన్న ప్రశ్నకు తారక్ రెస్పాండ్ అయ్యారు. దేవుడి ఆశీస్సులు, ఓవర్సీస్ అభిమానులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఆ రికార్డు సాధ్యమైందని తెలిపారు. అయితే ట్రైలర్ కూడా వేరే లెవెల్ లో మెప్పించడంతో.. దేవర మరిన్ని రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని అంతా చెబుతున్నారు. మరి దేవర మూవీ ఎలా ఉంటుందో, ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి.