చావా హీరో మరో క్రేజీ డైరెక్టర్‌తో
నేను విక్కీ -కత్రినా ఇద్దరికీ చాలా క్లోజ్. కాబట్టి నేను విక్కీతో కలిసి పనిచేయడానికి ఇష్టపడతాను. ఒక నటుడితో దర్శకుడు ఆలోచనలను చర్చిస్తాడు.;
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కబీర్ ఖాన్ 'చావా' హీరో విక్కీ కౌశల్ ఓ భారీ ప్రాజెక్ట్ కోసం చేతులు కలుపనున్నారు. ఆ మేరకు దర్శకుడు అధికారికంగా దీనిని ధృవీకరించాడు. ప్రస్తుతానికి ఇంకా ఇది ప్రాథమిక దశలోనే ఉన్నా, విక్కీకౌశల్ తో మంతనాలు సాగిస్తున్నానని కబీర్ ఖాన్ అన్నారు. ఈ ప్రాజెక్టుకు ఇంకా సమయం పట్టొచ్చు. ఇంకా ఆరంభంలోనే ఉన్నామని, తన ఆలోచనలను విక్కీకి చెబుతున్నానని అన్నాడు.
కబీర్ ఖాన్ పాపులర్ హీరో సల్మాన్ ఖాన్ కి అత్యంత సన్నిహితుడు. అతడు సల్మాన్, కత్రిన ఇద్దరితోను పలు క్రేజీ ప్రాజెక్టుల కోసం పని చేసాడు. కత్రిన, విక్కీ ఇద్దరితో తనకు ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా విక్కీతో కలిసి పని చేయడం సులువుగా ఉంటుందని కూడా కబీర్ అన్నారు. సల్మాన్ కి భజరంగి భాయిజాన్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని అందించిన కబీర్ ఖాన్, విక్కీ కోసం ఎలాంటి స్క్రిప్టును ఎంపిక చేస్తారు? అన్నది ఆసక్తిని కలిగిస్తోంది.
కబీర్ ఖాన్- కత్రినా కైఫ్ న్యూయార్క్ - ఏక్ థా టైగర్ వంటి పలు విజయవంతమైన చిత్రాల కోసం కలిసి పనిచేశారు. వృత్తిపరమైన స్నేహానికి మించి నిజ జీవితంలో కూడా వారి మధ్య గొప్ప బంధం ఉంది. విక్కీ అత్యుత్తమ నటులలో ఒకరు అంటూ ప్రశంసలు కురిపించిన కబీర్ ఖాన్ అతడితో కలిసి పని చేయడానికి ఇష్టపడతానని అన్నారు.
నేను విక్కీ -కత్రినా ఇద్దరికీ చాలా క్లోజ్. కాబట్టి నేను విక్కీతో కలిసి పనిచేయడానికి ఇష్టపడతాను. ఒక నటుడితో దర్శకుడు ఆలోచనలను చర్చిస్తాడు. కలిసి పని చేయాలనే ఆలోచన ఉంటుంది.. విక్కీతో ప్రస్తుతం చర్చిస్తున్నాను! అని కబీర్ ఖాన్ అన్నారు. ప్రస్తుతానికి రెండు స్క్రిప్టులపై పని చేస్తున్నాను.. అని కూడా దర్శకుడు కబీర్ ఖాన్ అన్నారు. ఆరేడు నెలల విరామం తర్వాత దీనిపై పని చేస్తానని కూడా వెల్లడించాడు.
కబీర్ ఖాన్ ప్రస్తుతం తన వెబ్ సినిమా 'మై మెల్‌బోర్న్' విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. దీనిని మరో ముగ్గురు ప్రముఖ దర్శకులు - ఇంతియాజ్ అలీ, ఓనిర్, రిమా దాస్ లతో కలిసి దర్శకత్వం వహించారు. ఇది మార్చి 6న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిజీలలో, మార్చి 14న భారతదేశంలో విడుదల కానుంది.