ఆమిర్ ఖాన్ ప్రేమలో మరో కొత్త ట్విస్ట్!

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ మరోసారి ప్రేమలో పడ్డాడని చాలా రోజులుగా అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.;

Update: 2025-03-14 05:03 GMT

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ మరోసారి ప్రేమలో పడ్డాడని చాలా రోజులుగా అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయన వ్యక్తిగత జీవితం ఎప్పుడూ ఆసక్తికరంగా మారుతుంటుంది. తాజాగా, ముంబైలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన తన కొత్త గర్ల్‌ఫ్రెండ్ గౌరీ స్ప్రాట్‌ను పరిచయం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది అతని 60వ పుట్టినరోజున అందరికి బిగ్ సర్‌ప్రైజ్‌గా మారింది.

ఆమిర్ ఖాన్ తన వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడూ ఓపెన్ గానే మాట్లాడే వ్యక్తి. రీనా దత్తా, కిరణ్ రావుతో విడాకులు తీసుకున్న తర్వాత, ఇక మళ్ళీ ఆయన ప్రేమలో పడతారని ఎవరూ ఊహించలేదు. కానీ 18 నెలలుగా గౌరీతో రిలేషన్‌లో ఉన్నట్లు వెల్లడించడం అందరికీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా ఆమెకు 6 ఏళ్ల కుమారుడు ఉన్నాడనే విషయాన్ని వెల్లడించడంతో మరింత హాట్ టాపిక్ గా మారింది.

ఈ వయసులో మళ్ళీ పెళ్లి చేసుకుంటారా? అన్న ప్రశ్నకు సూటిగా సమాధానం ఇవ్వకపోయినా, "ఇది పెళ్లికి సంబంధించింది కాదేమో, కానీ మేమిద్దరం బలమైన అంకితభావంతో ఉన్నాం" అంటూ క్లారిటీ ఇచ్చారు. ఆమిర్ మాట్లాడుతూ, "నా గర్ల్‌ఫ్రెండ్ కత్రినా కైఫ్ కంటే అందంగా ఉంటుంది. ఆమెతో ఉన్నప్పుడు నేను ఇంట్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది" అని చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పటికే తన పిల్లలు జునైద్, ఇరా కూడా ఆమెను కలిశారని, గౌరీతో సంతోషంగా ఉన్నారని తెలిపారు.

గౌరీ తొలుత బెంగళూరులో ఉండేదని, అయితే ఇటీవల ముంబైకి మారిపోయిందని వెల్లడించారు. సందర్భం ఏదైనా, ఆమిర్ ఎప్పుడూ తన జీవితాన్ని ఓ సినిమా మాదిరిగానే అందుబాటులో ఉంచే వ్యక్తి. ముఖ్యంగా గౌరీ గురించి మాట్లాడుతూ, 25 సంవత్సరాల క్రితం తాను ఆమెను కలిశానని, తర్వాత కాలక్రమంలో కొంత గ్యాప్ వచ్చినట్లు చెప్పారు. కానీ కొన్ని సంవత్సరాల క్రితం మళ్ళీ కలుసుకుని ప్రేమలో పడ్డామని వెల్లడించారు.

ఆమిర్ లేటెస్ట్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా "భువన్‌కు అతని గౌరీ లభించిపోయింది" అంటూ తన లగాన్ సినిమా డైలాగ్‌ను ప్రస్తావించడం హైలైట్‌గా మారింది. ఇప్పటివరకు బాలీవుడ్ స్టార్ లవ్ స్టోరీలు ట్రెండ్ అయినా, 60 ఏళ్ల వయసులో ఒక స్టార్ హీరో మళ్ళీ కొత్త ప్రేమను స్వీకరించడం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మొత్తానికి, ఆమిర్ ఖాన్ వ్యక్తిగత జీవితం ఎప్పుడూ అభిమానులకు ఆసక్తికరమే. అయితే, ఆయన చేసిన తాజా ప్రకటన వల్ల అభిమానులు, ఇండస్ట్రీ వర్గాలు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి ఎప్పుడనేది తెలియదు, కానీ తన జీవితంలో కొత్త ప్రేమను అంగీకరించిన ఆమిర్, మరోసారి వార్తల్లో నిలిచాడు.

Tags:    

Similar News