కెతిక అనుకున్న రీచ్ వచ్చినట్టేనా..?
ముఖ్యంగా కెతిక ఈ సాంగ్ చేస్తే కెరీర్ బూస్ట్ అందుకుంటుంది అన్న ఆశతో చేసింది. సినిమా రిలీజ్ కు ముందే ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.;
రొమాంటిక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కెతిక శర్మ ఆ సినిమాలో తన గ్లామర్ లుక్స్ తో ఆకట్టుకున్నా సినిమా సక్సెస్ అవ్వకపోవడంతో పెద్దగా పట్టించుకోలేదు. ఇక ఆ తర్వాత నాగ శౌర్యతో లక్ష్య చేయడంతో అది వర్క్ కాలేదు. వైష్ణవ్ తేజ్ తో రంగ రంగ వైభవంగా సినిమా చేసినా అది కూడా తుస్సుమనిపించింది. ఇక రెండేళ్ల క్రితం రిలీజైన బ్రో సినిమాతో జస్ట్ ఓకే అనిపించింది అమ్మడు. ఆ తర్వాత ఒక్కటంటే ఒక్క ఛాన్స్ రాబట్టుకోలేదు అమ్మడు.
లేటెస్ట్ గా నితిన్ వెంకీ కుడుముల కాంబినేషన్ లో వస్తున్న రాబిన్ హుడ్ సినిమాతో అమ్మడు ఛాన్స్ అందుకుంది. సినిమాలో శ్రీలీల హీరోయిన్ కాగా అందులో అది దా సర్ ప్రైజు అనే స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది కెతిక శర్మ. ఈమధ్యనే రిలీజైన ఈ సాంగ్ మాస్ ఆడియన్స్ కు బాగా రీచ్ అయ్యింది. ముఖ్యంగా కెతిక ఈ సాంగ్ చేస్తే కెరీర్ బూస్ట్ అందుకుంటుంది అన్న ఆశతో చేసింది. సినిమా రిలీజ్ కు ముందే ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కెతిక కూడా తన మీద వస్తున్న ఈ అటెన్షన్ ని మరింత పెంచుకునేందుకు ఆమె కూడా సోషల్ మీడియాలో ఈ సాంగ్ నే ప్రమోట్ చేస్తుంది. సాంగ్ లో కెతిక గ్లామర్ ట్రీట్ కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తుందని అంటున్నారు. కెతిక శర్మ నిజంగానే ఈ సాన్ తో ఒక ఊపు ఊపేసేలా ఉంది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ సాంగ్ కి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. యూట్యూబ్ లో రిలీజైన సాంగ్ కే మంచి రెస్పాన్స్ రాగా ఇక థియేటర్ లో ఈ సాంగ్ ఆడియన్స్ ని ఊగిపోయేలా చేస్తుందని అంటున్నారు.
నితిన్, వెంకీ కుడుముల ఇదివరకు భీష్మతో హిట్ అందుకున్నారు. ఇప్పుడు మళ్లీ రాబిన్ హుడ్ తో ఆ హిట్ మేనియా కొనసాగించాలని చూస్తున్నారు. సినిమా పై ఇప్పటికే పాజిటివ్ బజ్ ఏర్పడగా ట్రైలర్ రిలీజ్ అయితే కానీ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందన్నది తెలుస్తుంది. ఐతే సినిమా గురించి మేకర్స్ మాత్రం తప్పకుండా ఆడియన్స్ ని అలరిస్తుందని గట్టి నమ్మకంతో చెబుతున్నారు. నితిన్ కూడా కొన్నాళ్లుగా సక్సెస్ కోసం ట్రై చేస్తున్నాడు. రాబిన్ హుడ్ అతను కోరుకుంటున్న హిట్ అందిస్తుందో లేదో చూడాలి.