కొడుకు తర్వాత నా సపోర్ట్ నానికే!
బాలనటిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన సౌత్ ఇండియన్ సీనియర్ నటి రోహిణి గురించి తెలుగు వారందరికీ తెలుసు.;
బాలనటిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన సౌత్ ఇండియన్ సీనియర్ నటి రోహిణి గురించి తెలుగు వారందరికీ తెలుసు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, టీవీ హోస్ట్ గా, సామాజిక కార్యకర్తగా, రచయితగా, అన్నింటికీ మించి గొప్ప నటిగా చాలా గొప్ప పేరు సంపాదించుకున్నారు రోహిణి. ముందు మలయాళ నటిగా తన కెరీర్ ను స్టార్ట్ చేసి ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేశారామె.
ప్రస్తుతం టాలీవుడ్ లో ఎంతో బిజీగా ఉన్న నటుల్లో ఈమె కూడా ఒకరు. తల్లి పాత్రలో రోహిణి నటించే తీరు అందరినీ ఎంతగానో మెప్పిస్తుంది. ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోయే టాలెంట్ ఉన్న రోహిణి నేచురల్ స్టార్ నానితో కలిసి పలు సినిమాల్లో నటించింది. దీంతో వారిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది.
నాని ని తన సొంత కొడుకులా భావించే రోహిణి ఇప్పుడు కోర్టు సినిమాను ఉద్దేశించి తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. తన కొడుకు తర్వాత తాను సపోర్ట్ ఇచ్చే ఏకైక వ్యక్తి నానినే అని ఆమె ట్వీట్ చేశారు. కోర్టు మూవీతో ఆడియన్స్ కు ఇంట్రెస్టింగ్ కథను చెప్పేందుకు కట్టుబడి ఉన్నామని రోహిణి చెప్పారు. కోర్టు సినిమాకు నాని నిర్మాత అన్న విషయం తెలిసిందే.
ఇప్పుడే కాదు గతంలో కూడా నానితో తనకున్న అనుబంధాన్ని పలు సందర్భాల్లో బయటపెట్టారు రోహిణి. మా నాని ఏం చేసినా, అందులో నేనుంటానని ఓ ఈవెంట్ లో రోహిణి సభా ముఖంగా తెలపగా, ఇప్పుడు మరోసారి రోహిణి, నానిపై ఉన్న అభిమానాన్ని చాటుకుంది. ఇక కోర్టు సినిమా విషయానికొస్తే నాని నిర్మాతగా రూపొందిన ఈ సినిమా ప్రీమియర్స్ తోనే మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది.