# తారక్ 31 వచ్చే వారం నుంచే వేట!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ -ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి ముహూర్తం కుదిరిందా? అంటే అవుననే తెలుస్తోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ -ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి ముహూర్తం కుదిరిందా? అంటే అవుననే తెలుస్తోంది. ఇప్పటికే సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వాలి కానీ తారక్ బాలీవుడ్ సినిమా `వార్ 2` కొలిక్కి రాకపోవడంతో వాయిదా పడుతోంది. అయితే తాజాగా తారక్ పోర్షన్ ఈ నెలఖరుతో పూర్తవుతుంది. ఈనేపథ్యంలో ప్రశాంత్ నీల్ రెగ్యులర్ షూటింగ్ ముహూర్తం పెట్టేసారు. వచ్చే వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.
తొలి షెడ్యూల్ లో తారక్ లేని సన్నివేశాలు చిత్రీకరిస్తారు. ఇందులో తారక్ తప్ప మిగతా ప్రధాన నటులంతా భాగమవుతారు. మార్చి నుంచి తారక్ టీమ్ తో జాయిన్ అవుతారు. ఫిబ్రవరి ఎండింగ్ కల్లా వార్ 2 నుంచి తారక్ రిలీవ్ అయిపోతాడు. అటుపై ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కే పూర్తిగా డేట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో ఓల్డ్ కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో ఓ సెట్ నిర్మిస్తున్నారు.
అచ్చంగా అప్పటి కలకత్తానే దించేస్తున్నారట. ఇందులో రెండవ షెడ్యూల్ మొదలవుతుందట. ఇందులో తారక్ సహా ప్రధాన తారగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో తారక్ కి జోడీగా రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా ఎంపికైంది. సినిమాలో ఆమె పాత్ర కూడా బలంగా ఉంటుందని సమాచారం. `దేవర` తర్వాత తారక్ రెండవ సోలో పాన్ ఇండియా చిత్ర మిది.
సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. `కేజీఎఫ్` , `సలార్` లాంటి బ్లాక్ బస్టర్లు ప్రశాంత్ నీల్ అందించిన నేపథ్యంలో తారక్ ని మరింత బలమైన కథలో చూపించబోతున్నాడని అభిమానులు ఆశిస్తున్నారు. షూటింగ్ సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసి జనవరి 9న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.